Vasthu Tip (వాస్తు టిప్) 002

 Vasthu Tip (వాస్తు టిప్) 002


#గృహం లో #ఆగ్నేయం (#SouthEast) లో ఎటువంటి గుంతలు, నీటి సంప్ లు, సెప్టిక్ ట్యాంకులు ఉండకూడదు..... ఇది ఇంటిలోని స్త్రీల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం కలిగిస్తుంది (అనారోగ్య పాలు చేస్తుంది). విపరీతమైన ఒత్తిడికి గురిచెయ్యడమే కాకుండా...... #ధనసంబంధ ఇబ్బందులను కూడా ఇస్తుంది...... ఇంకా #వివాహాలు జరగాల్సిన గృహంలో వివాహ సంబంధాలు అంతగా కుదరకపోవడం, ఆటంకాలు ఏర్పడడం........ భార్య భర్తల #వైవాహికజీవితంలో కలతలను ఇస్తుంది.

#నైరుతి (#SouthWest ) లో ఎటువంటి గుంతలు, నీటి సంప్ లు, సెప్టిక్ ట్యాంకులు ఉండకూడదు..... ఇది ఇంటిలోని పురుషుల #ఆరోగ్యంపై, ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది..... సామాన్యంగా ఇటువంటి దోషం ఉన్న గృహంలో ఇంటి పెద్దకి అపాయం (గండం).

ఇటువంటి దోషాలు ఉన్న ఇంటిలో విపరీతమైన negative energy కూడా ఉంటుంది...... ఇవి అనుభవపూర్వకంగా చెప్తున్న విషయాలు...... నేను (కర్నాటి వనిత) వాస్తుకు వెళ్లి చూసిన విషయాలు కూడా త్వరలోనే మీతో పంచుకుంటాను.

(ఇంకా ఉంది........)
కర్నాటి వనిత

Comments

Popular posts from this blog

రుద్రాభిషేకం ఎన్నిసార్లు చేయాలి?

Vasthu Tip (వాస్తు టిప్) 005

శ్రీ కేదారేశ్వర వ్రత కథ