Posts

Showing posts with the label శ్రీ కార్తీక పురాణము 13వ అధ్యాయము

శ్రీ కార్తీక పురాణము 13వ అధ్యాయము

Image
                                           శ్రీ కార్తీక పురాణము  13 వ   అధ్యాయము   ◆   # కన్యాదానఫలము   ◆ వశిష్టుడిట్లు చెప్పెను. జనకరాజా!   # కార్తీకమాస   మందు చేయదగిన ఆవశ్యకములైన కార్తీక ధర్మములను మా తండ్రియైన బ్రహ్మచేత నాకు చెప్పబడినవి. అవన్నియు చేయదగినవి. చేయనియెడల పాపము సంభవించును. ఇది నిజము. సంసార సముద్రమునుండి దాటగోరువారును , నరకభయముల వారును ఈధర్మములను తప్పక చేయవలెను. కార్తీకమాసమందు కన్యాదానము , ప్రాతఃస్నానము , శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనము చేయించుటకు ధనమిచ్చుట , విద్యాదానము , వస్త్ర దానము , అన్నదానము , ఇవి ముఖ్యములు. కార్తీకమాసమందు ద్రవ్య హీనుడైన బ్రాహ్మణపుత్రునకు ఉపనయనమును చేయించ దక్షిణనిచ్చిన యెడల అనేక జన్మములలోని పాపములు నశించును. తన ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆ వటువుచే చేయబడిన గాయత్రీ జపఫలము వలన పంచమహాపాతకములు భస్మమగును. గాయత్రీ జపము , హరిపూజ , వేదవిద్యాదానము వీటిఫలమును చెప్పుటకు నాకు శక్యముగాదు. పదివేలు తటాకమ...