శ్రీ కార్తీక పురాణము 9వ అధ్యాయము
శ్రీ కార్తీక పురాణము 9 వ అధ్యాయము # విష్ణు _ పార్శద _ యమదూతల _ వివాదము . విష్ణుదూతలడిగిరి. ఓ యమదూతలారా! మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి ? మీ యమదండనకు ఎవ్వడు తగినవాడు ? పుణ్యమనగా ఏమి ? ఈవిషయములన్నిటిని మాకు చెప్పమని విష్ణుదూతలడుగగా యమదూతలు ఓ విష్ణుదూతలారా! సావధానముగా వినుడు. సూర్యుడు , చంద్రుడు , అగ్ని , వాయువు , ఆకాశము , గోవులు , సంధ్యలు , పగలు , దిక్కులు , కాలము ఇవి మనుష్యుని పుణ్యపాపములను గురించి సాక్షులు. మేము వీరి సాక్ష్యముతో విచారించి పాపములను చేసిన వానిని దండింతుము. వేదమార్గమును వదలి ఇచ్ఛానుసారముగా తిరుగుచు , వేదశాస్త్రములను దూషించుచు సాధు బహిష్కృతుడైన వానిని మేము దండింతుము. బ్రాహ్మణుని , గురువును , రోగిని పాదములచేత తన్నువాడును , తల్లిదండ్రులతో కలహించువాడును అయిన వారిని , నిత్యము అబద్ధమాడుచు జంతువులను జంపుచు కులాచారములను వదిలినవారిని , ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్నవానిని , డాంబికుని , దయాశాంతులు లేని వానిని భార్యతో క్రీడించు ...