శ్రీ కార్తీక పురాణము 24వ అధ్యాయము
శ్రీ కార్తీక పురాణము 24 వ అధ్యాయము ◆ # అంబరీషుని _ ద్వాదశీవ్రతము అత్రి ఇట్లు పల్కెను. అగస్త్య మునీంద్రా! నీకు # కార్తీకవ్రత మందును , హరిభక్తి యందును ఆసక్తి ఉన్నది. కాన # కార్తీకమహాత్మ్యము ను చెప్పెద వినుము. సావధానముగా విన్న ఎడల పాపములు నశించును. # కార్తీకమాస మందు శుక్ల ద్వాదశి హరి బోధిని , ఈ ద్వాదశి సమస్త తీర్థ స్నాన ఫలమును ఇచ్చును. అన్ని ద్వాదశులలో అధిక ఫలము ఇచ్చునది. సమస్త యజ్ఞములను చేసిన ఫలమును హరిబోధిని యగు ద్వాదశి ఇచ్చును. ఇది కాక ఈ ద్వాదశి హరియందును , ఏకాదశియందును , భక్తినిచ్చును. కాబట్టి ద్వాదశి హరికి ప్రియమైనది. # ద్వాదశి సూర్య చంద్ర గ్రహణముల కంటే అధిక పుణ్యప్రదము. ఏకాదశి కంటే నూరు రెట్లు ఎక్కువది. సమస్త పుణ్యమును ఇచ్చునది. ద్వాదశి నాడు చేసిన పుణ్యము కోటి రెట్లగును. ద్వాదశి పుణ్యదినము గనుక కొంచెముగా ఉన్నను పారణకు ఉపయోగించవలెను. కానీ ద్వాదశిని విడిచి ...