శ్రీ కార్తీక పురాణము 21వ అధ్యాయము
శ్రీ కార్తీక పురాణము 21 వ అధ్యాయము ◆ # పురంజయుడు _ కార్తీక _ ప్రభావము _ నెరుంగుట ◆ ఇట్లు యుద్ధమునకు పురంజయుని జూచి యుద్ధ ప్రవీణులయిన ఆ రాజులు కోప రక్తాక్షులై శస్త్రములతోను , అస్త్రములతోను , బాణములతోను , వాడియైన గుదియలతోను , ఇనుపకట్ల లాటీ కర్రలతోను , హస్తాయుధములయిన గుదియలతోను , కత్తులతోను , భల్లాతకములతోను , పట్టసములతోను , రోకళ్ళతోను , శూలములతోను , తోమరములతోను , కుంభాయుధములతోను , గొడ్డళ్ళతోను , కర్రలతోను , ఆయుధముల విక్షేపములతోను , యుద్ధము చేసిరి. గుర్రపురౌతులతో గుర్రపు రౌతులు , ఏనుగులు ఏనుగుల తోడను , రథికులతో రథికులు , కాల్బంటులతో కాల్బంటులు , శూరులతో శూరులును , ఆయుధములతో యుద్దమును భటులనన్యోన్యము క్రూరవాక్యములను పలుకుచు చేసిరి. ఓ అగస్త్య మునీంద్రా! అంతలో కాంభోజ మహారాజు వస్త్రాదులను పదిలపరచికట్టికొని కవచమును ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుర్బాణములను ధరించి కోలాహల ధ్వని చేయుచు వడిగా పురంజయుని వద్దకు వచ్చి...