Posts

Showing posts with the label కార్తీకచతుర్ధి నాగులచవితి

కార్తీకచతుర్ధి నాగులచవితి

Image
కార్తీకచతుర్ధి నాగులచవితి దీపావళి తరువాత వెంటనే వచ్చే చక్కటి పండుగ   ‘ నాగులచవితి ’.   నాగుల చవితి నాడు ప్రొద్దున్నే లేచి మా గ్రామంలోని పిల్లలూ పెద్దలు అందరూ వూరి చివర గరువులో ఉన్న పెద్ద పుట్ట దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అందరు పుట్టకి పూజ చేసి ,   పాలు ,   అరటి పళ్ళు ,   పుట్ట కలుగు లో వేసేవారు. కొందరు కోడి గ్రుడ్లు కూడా వేసే వారు. పుట్ట మన్ను భక్తిగా చెవులకు పెట్టుకునే వాళ్ళం. ఇంటి దగ్గర మా అమ్మగారు ,   పూజ గది గోడకు చలిమిడి ,   చిమిలి తో నాగేంద్రులను తయారుచేసి అతికించి పాలు పోసి పూజ చేసేవారు. # కార్తీకమాసం   శివకేశవులకే కాక సుబ్రహ్మణ్యస్వామికి కూడా విశేషమైనదిగా చెప్పుకోవచ్చును. ఈ మాసం పేరే కార్తికేయుని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుచేత ఈ మాసం లోని శుద్ద చవితి నాడు సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. ఈ రోజును   ‘ నాగుల చవితి ’, ‘ మహా చతుర్ధి ’   అంటారు. ఈ రోజు పచ్చి చలిమిడి ,   చిమిలి చేసుకుని ,   ఆవు పాలు ,   పూలు ,   పళ్ళు కూడా తీసుకుని ,   పాము పుట్ట దగ్గరకు వెళ్లి ,   నాగదేవతకు దీపారాధన చేసి , ...