శ్రీ కార్తీక పురాణము 8వ అధ్యాయము
శ్రీ కార్తీక పురాణము 8 వ అధ్యాయము ◆ # శ్రీహరి _ నామస్మరణా _ ధన్యోపాయం ◆ వశిష్ట మునీంద్రా!నా మనస్సులో గొప్ప సందేహము కలిగినది. ఆ సందేహమును తెలిపెదను దానిని నశింపజేయుము. మీరు నాకు ధర్మసూక్ష్మమును చెప్పితిరి. పాతకములలో గొప్పవానిని చెప్పినారు. వర్ణ సంకరకారకములైన మహాపాపములు చేసిన దుర్జనులు వేదత్రయోక్తములయిన ప్రాయశ్చిత్తములను జేసికొని పరిశుద్ధులగుదురని ధర్మశాస్త్రములందు చెప్పబడియుండగా మీరు ధర్మలేశముచేతనే పరిశుద్ధులై విష్ణులోకమును పొందుదురని చెప్పినారు. అది ఎట్లు సంభవమగును ? ఓ మునీశ్వరా! అనంత పాతకములు చేసి , ఈ పాపములు గొప్పవనియు వీటికి ప్రాయశ్చిత్తములు చేయించుకొనవలెననియు తెలిసియు అట్లు చేయక దైవవశముచేత సంభవించి కార్తీక దీపదానాది పుణ్యముల వలన వైకుంఠమునకు పోవుట ఎట్లు సంభవించును ? వజ్రపర్వతమును గోటికొన చివరిభాగము చేత చూర్ణము చేయసాధ్యమా ? స్వయముగా గొప్ప పర్వతమునెక్కి అక్కడనుండి క్రిందకిపడుతూ మధ్యనున్న చిన్నతీగను పట్టుకున్న యెడల పడక...