మార్గశిర మాసం ముక్తికి మార్గం
మార్గశిర మాసం ముక్తికి మార్గం 24-11-2022 నుంచి మార్గశిరమాసారంభం " # మార్గశిరమాసం " - ముక్తికి మార్గం ◆ మార్గశిర మాసం అనగా..... చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి మృగశిర నక్షత్రంతో కలసిన పౌర్ణమినాడు చంద్రుడు ఉదయించేనెలను మార్గశిర మాసం అంటారు. ఈ నెల విష్ణుదేవుని రూపం. ఈ మాసం ప్రకృతి కాంతకు సీమంతం లాంటిది. తుషార బిందువుల హేమంతం. శ్రీమహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం. భగవద్గీతలోని విభూతియోగంలో - "మాసానాం మార్గశీర్షం" మాసాల్లో తాను మార్గశిరమాసాన్నని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ నెలలో సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలిబాధ ఉండదు. బ్రాహ్మీముహూర్తంలో నీటిలో అగ్ని , సూర్యుడు కలసి ఉంటారని శాస్త్రం సూచిస్తుంది. అందువలన బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో ఆరోగ్యప్రదం , సంధ్యావందన జపధ్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి , అగ్నితేజము కూడా మన మనస్సును , బుద్ధిని వికసింపజేస్తాయి. అందుకే.... మార్గశిర మ...