Posts

Showing posts with the label శ్రీ కార్తీక పురాణము 19వ అధ్యాయము

శ్రీ కార్తీక పురాణము 19వ అధ్యాయము

Image
                                              శ్రీ కార్తీక పురాణము  19 వ   అధ్యాయము ◆   # చతుర్మాస్య _ వ్రత _ ప్రభావనిరూపణ . జ్ఞాన సిద్ధుడిట్లు స్తుతిజేసెను. వేదవేత్తలు మిమ్ము వేదవేద్యునిగాను , వేదాంతములందు ప్రతిపాదింబపడిన వానిని గాను , గుహ్యమైనవాని గాను , నిశ్చలునిగాను , అద్వితీయునిగాను , తెలుసు కొనుచున్నారు. చంద్ర , సూర్య , శివ బ్రహ్మాదుల చేతను రాజుల చేతను స్తుతించబడు రమ్యములైన మీపాదపద్మములము నమస్కరించుచున్నాము. వాక్యములతో చెప్ప శక్యముగాని వాడవు. శివునిచే పూజించు పాదపద్మములు కలవాడవు. సంసార భయమును తీసివేయు సమర్ధుడవు. జన్మసంసార సముద్రమునందున్న శివాదులచేత నిత్యము కొనియాడబడు వాడవు. చరాచర ప్రాణులచే స్తుతింపబడినవాడవు. పంచమహాభూతములు చరాచర రూపములైన అన్ని భూతములు నీ విభూతి విస్తారమే. పరముకంటే పరుడవు. నీవే ఈశ్వరుడవు. ఈ చరాచరరూపమైన ప్రపంచమంతయు దానికి కారణమైన మాయతో కూడా నీయందు తోచుచున్నది. త్రాడు నందు పాము భ్రాంతి వలె పూలమాల భ్రాంతివలె తోచుచున్నది అనగా లేదని...