మహాశివునికి మారేడుదళం అంటే ఎందుకంత ఇష్టం
మహాశివునికి మారేడుదళం అంటే ఎందుకంత ఇష్టం.... ? మహాశివుడికి మారేడు దళాలంటే మహా ఇష్టం , అందుకే మారేడును ” శివేష్ట ” అని అంటారు. మారేడును బిల్వ అని కూడా అంటారు. # బిల్వం అంటే శ్రీఫలమును ఇచ్చేది. ఇంకా లక్ష్మీదేవికి ఇష్టమైన ఫలములు ఇచ్చేది. అంతేకాకుండా సిరిని తెచ్చే ఫలము కలది అని అర్ధం కూడా. మారేడు మహా మంగళకరమైనది , మారేడు పత్రాలు త్రిశిఖలా ఉంటాయి. మూడు ఆకులతో ఉన్నందున త్రిశూలానికి సంకేతంగా భావిస్తారు..... ఈశ్వరారాధనలో మారేడు దళాలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. మారేడు దళాలతో పూజిస్తే శివుడు త్వరగా అనుగ్రహిస్తాడని , పూజలో ఎంత ఎక్కువ బిల్వ పత్రాలు వాడితే అంత ఎక్కువ కరుణాకటాక్షాలు ప్రసాదిస్తాడని , మోక్షం కూడా ప్రాప్తిస్తుందని వేదాలు ఉద్ఘోషిస్తున్నాయి.... కనుకనే శివపూజలో బిల్వ పత్రాలు విస్తృతంగా ఉంటాయి. కొందరు లక్ష బిల్వ పత్రాలతో , మరికొందరు ఏకంగా కోటి బిల్వ పత్రాలతో శివుని ఆరాధిస్తారు. సర్వ శుభాలూ చేకూర్చి , మోక్షాన్ని ప్రసాదిస్తుంది కనుక బిల్వ వృక్షాన్ని దైవంతో సమానంగా కొలుస్తారు. పూజలు , పునస్కారాల్లో పూవులతో బాటు కొన్ని ఆకులను ఉపయోగిస్తారు. వాటిల్లో బిల్వ పత్రం ప్రధానమైంది , శ్ర...