శ్రీ కార్తీక పురాణము 14వ అధ్యాయము
శ్రీ కార్తీక పురాణము 14 వ అధ్యాయము ◆ # ఆబోతును _ అచ్చుబోసి _ వదలుట ( వృషోత్సర్గము) ◆ # కార్తీకపూర్ణిమా దినమందు వృషోత్సర్గమును (ఆబోతు అచ్చుపోయుట) చేయువానికి జన్మాంతరీయ పాపములు కూడా నశించును. కార్తీకవ్రతము మనుష్య లోకమందు దుర్లభము సులభముగా ముక్తినిచ్చునది. కార్తీక పూర్ణిమ నాడు పితృప్రీతిగా వృషోత్సర్గమును జేయువానికి కోటిమారులు గయాశ్రాద్ధమును జేసిన ఫలముగలుగును. రాజా! స్వర్గమందున్న పితరులు మన వంశమందెవ్వడైనను కార్తీక పూర్ణిమనాడు నల్లని గిత్తను , గిత్తదూడను లేక ఆబోతును విడుచునా , అట్లయిన మనము తృప్తిబొందుదుమని కోరుచుందురు. ధనవంతుడుగాని , దరిద్రుడుగాని కార్తీకపూర్ణిమ రోజున వృషోత్సర్గమును జేయనివాడు యమలోకమందు అంథతమిస్రమను నరకమును బొందును. కార్తీకపూర్ణిమ రోజున వృషోత్సర్గమును జేయక గయాశ్రాద్ధ మాచరించినను , ప్రతి సంవత్సరము తద్దినము పెట్టినను , పుణ్యతీర్థములు సేవించినను , హాలయము పెట్టినను పితరులకు తృప్తిలేదు. వాటన్నిటి...