శ్రీ కార్తీక పురాణము 7వ అధ్యాయము
శ్రీ కార్తీక పురాణము 7 వ అధ్యాయము ఏడవ రోజు పారాయణము ◆ # శివకేశవార్చన _ విధులు . ◆ వసిష్ఠ మహాముని ఇలా చెబుతున్నారు. ఓ జనక మహారాజా! విను. కార్తీకమహాత్మ్యమును ఇంకా వివరిస్తాను. ప్రసన్న చిత్తుడవై విను. # కార్తీకమాసము లో ఎవరు కమలముల చేత పద్మపత్రాయతాక్షణుడైనటువంటి శ్రీ హరిని పూజిస్తారో వారి ఇంట పద్మవాసిని అయిన లక్ష్మీదేవి నిత్యమూ నివాసముంటుంది. ● ఈ మాసములో భక్తితో తులసీదళములతోనూ , జాతి పుష్పములైన జాజి , మందార , పున్నాగ , చంపక ఇత్యాదులతోనూ శ్రీ హరిని పూజించువాడు తిరిగి భూమిమీద జన్మించడు. ఈ మాసమున మారేడుదళములతో సర్వవ్యాపకుడైన శ్రీహరిని పూజించినవాడు తిరిగి ఈ భూమిమీద జన్మించడు. కార్తీక మాసములో భక్తితో పండ్లను దానమిచ్చిన వాని పాపములు సూర్యోదయము కాగానే చీకటి తొలగినట్లు నశిస్తాయి. ఉసిరిక కాయలతో ఉన్న ఉసిరి చెట్టు క్రింద శ్రీ హరిని పూజించు వానిని యముడు కన్నెత్తి చూసే సాహసమైనా చేయజాలడు. ● కార్తీక మాసమున తులసీ దళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును , దానిలో సందేహమేలేదు. కార్తికమాసలో బ్రాహ్మణులతో కూడా వనభోజన మాచరించు వాని మహాపాతకములన్నీ నశిస్తాయి....