శ్రీ కార్తీక పురాణము 11వ అధ్యాయము
శ్రీ కార్తీక పురాణము 11 వ అధ్యాయము ◆ # మంథరుడు _ పురాణమహిమ ◆ రాజోత్తమా! తిరిగి చెప్పెదను వినుము. # కార్తీకమాస మందు అవిసె పువ్వుతో హరిని పూజించిన వాని పాపములు నశించును. చాంద్రాయణ వ్రత ఫలము పొందును. కార్తీకమాస మందు గరికతోను , కుశలతోను హరిని పూజించువాడు పాపవిముక్తుడై వైకుంఠమును చేరును. కార్తీకమాసమందు చిత్రమైనరంగులతో గూడిన వస్త్రములను హరికి సమర్పించినవాడు మోక్షము నొందును.కార్తీకమాస మందు స్నానమాచరించి హరిసన్నిధిలో దీపమాలలను ఉంచువాడును , పురాణమును చెప్పువాడును , పురాణమును వినువాడును పాపములన్నియును నశింపజేసుకొని పరమపదమును పొందుదురు. ఈవిషయమై ఒక పూర్వకథ గలదు. అది విన్నమాత్రముననే పాపములు పోవును. ఆయురారోగ్యములను ఇచ్చును. దానిని చెప్పెద వినుము. ◆ కళింగదేశమందు మందరుడను ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు స్నాన సంధ్యావందనాదులను విడిచి పెట్టినవాడై ఇతరులకు కూలి చేయుచుండెడివాడు. అతనికి మంచిగుణములు గలిగి సుశీలయను పేరుగల భా...