హారతి దీపం విశిస్టతలు ఏమిటి ఎన్ని రకాలు ఎన్ని వత్తులు
హారతి దీపం విశిష్టతలు ఏమిటి ఎన్ని రకాలు ఎన్ని వత్తులు ? హారతి దీపం విశిష్టతలు ఏమిటి ? ఎన్నిరకాలు , ఎన్ని వత్తులు..........!! శ్రేష్ఠమైన నేతిలో మూడు వత్తులతో వెలుగొందుచూ , మూడులోకాల యొక్క గాడాంధకారాన్ని పోగొట్ట గల మంగళప్రదమైన జ్యోతిత్రయాన్ని వెలిగించి సర్వాంతర్యామియైన నీకు భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. దివ్య జ్యోతి స్వరూపమైన ఓ దైవమా! నన్ను ఈ ఘోర నరకం నుండి రక్షించు. ఇలా స్వామిని వేడుకుంటూ దీపారాధన చేస్తూ హారతులనిస్తుంటాం. హారతి భక్తునిలోని ఆత్మకు ప్రతీక. హారతి భక్తునిలో ఓ దివ్య తేజాన్ని కలిగిస్తుంది. ఆ పరంధామునిపై మనసును లగ్నం చేయడానికి హారతి ఉపకరిస్తుంది. దీపాలను పట్టుకుని దైవం ముందు తిప్పే విషయాలను గురించి ఆగమాలలో చెప్పబడింది. దీప షోడశోపాసన అంటూ రకరకాల హారతి పద్ధతులను గురించి వివరించబడింది. 3,5,7 నుంచి 251 వరకు తిప్పే హారతుల పద్ధతులున్నాయి. హారతిని దైవం ముందు వెలిగించి తిప్పడాన్ని దీప నిరంజనమని కూడ అంటారు. కర్పూరాన్ని వెలిగించడం ద్వారానో , లేక మూడు , ఐదు , ఏడు వత్తులను నేతిలో ముంచి వెలిగించిన దీపంతో...