Posts

Showing posts with the label కార్తీక శుద్ధ ద్వాదశి తిథి నాడు దృవోపాఖ్యానం చదవడం లేదా వినడం ఎంత అదృష్టం

కార్తీక శుద్ధ ద్వాదశి తిథి నాడు దృవోపాఖ్యానం చదవడం లేదా వినడం ఎంత అదృష్టం

Image
కార్తీక శుద్ధ ద్వాదశి తిథి నాడు దృవోపాఖ్యానం చదవడం లేదా వినడం ఎంత అదృష్టం # ధ్రువోపాఖ్యానం : భాగవతంలో ధృవోపాఖ్యానం అనే ఒక ఉపాఖ్యానం ఉంది. మీరు క్రతువు చేసేటప్పుడు ఒక పుణ్యదినం నాడు ఒక వ్రతం చేయాలి అంటే మనస్సు అక్కడ ఉండవచ్చు , ఉండకపోవచ్చు. కొన్ని కోట్లజన్మల తరువాత ఎప్పుడో ఎవడో ఒక్క మనుష్యుడు మాత్రమే ఈశ్వరుని అనుగ్రహం పొందిన వాడు మాత్రమే   # ద్వాదశి   నాడు ధృవోపాఖ్యానమును వింటున్నాడు. ద్వాదశినాడు ధృవోపాఖ్యానం వింటే ఎన్నో మంచి ఫలితములు వస్తాయి. ఎన్నో గ్రహములు ఉపశాంతి పొందుతాయి. ఎంతో మేలు జరుగుతుంది. మనిషి జీవితంలో ధృవుని వృత్తాంతమును వినాలి. భాగవతాంర్గతముగా వినడం అనేటటువంటిది మరింత గొప్పవిషయం. ద్వాదశి నాడు కానీ , పౌర్ణమి నాడు కానీ , అమావాస్య నాడు కానీ దినక్షయమునందు కానీ , అసురసంధ్యవేళ కానీ   # ధృవచరిత్ర   వింటే చాలా మంచిది.   # సుందరకాండ   తెలియని వారు ఎలా ఉండరో అలా ధృవోపాఖ్యానం ,   # ప్రహ్లాదోపాఖ్యానం   తెలియని వారు ఉండరు. ధృవచరిత్ర ఒక ఆశ్చర్యకరమయిన సందర్భము. మైథునసృష్టి జరగడం కోసమని బ్రహ్మగారు తన శరీరంలోంచి శతరూపనే స్త్రీ స్వరూపమును , స్వాయంభ...