Posts

Showing posts with the label శ్రీ కార్తీక పురాణము 18వ అధ్యాయము

శ్రీ కార్తీక పురాణము 18వ అధ్యాయము

Image
                                             శ్రీ కార్తీక పురాణము  18 వ   అధ్యాయము ◆   # సత్కర్మానుష్టాన _ ఫల _ ప్రభావము   ◆ ఆ అద్భుతపురుషుడు "మునీశ్వరా! నేను అనుగ్రహించబడితిని. నీదర్శనముయొక్క అనుగ్రహము వలన జ్ఞానవంతుడనైతిని. ఓ!మునివర్యా! నాకు నీవే తండ్రివి. నీవే సోదరుడవు. నీవే గురుడవు. నేను నీకు శిష్యుడను. దరిద్రుడనై మొద్దుగానున్న నాకిప్పుడు నీవుగాగ గతి ఎవ్వరు ? పాపవంతుడైన నేనెక్కడ ? ఇట్టి సద్గతి యెక్కడ ? పాపములకు స్థానమైన నేనెక్కడ ? పుణ్యమైన కార్తీకమాసమెక్కడ ? ఈమునీశ్వరులెక్కడ ? ఈ విష్ణుసన్నిధి ఎక్కడ/ ప్రారబ్ధ సుకృతమున్నయెడల తప్పక ఇట్లు ఫలించునుగదా ? నాకేదో పూర్వపుణ్యమున్నది. దానిచే ఇది లభించెను. అయ్యా! నాయందు దయయుంచి బాగా తెలియజెప్పుము". " మనుష్యులు విధిగా కర్మలెట్లు చేయుదురు ? ఆకర్మలకు ఫలమెట్లు కలుగును ? వాటి ఉపదేశమెట్లు , చేయుటకు ముఖ్యకాలమెద్ది ? కర్మలెవ్వి ? ఏమి కోరి చేయవలెను ? ఈ విషయమంతయు వినగోరితిని గనుక చెప్పుము. నీ వాక్కు అను వజ్రాయుధముచేత న...