శ్రీ కార్తీక పురాణం 3వ అధ్యాయం
కార్తీకపురాణం తృతీయోధ్యాయం ■ అథ తృతీయోధ్యాయ ప్రారంభః ● #3 వ _ అధ్యాయం _ కార్తీకమాస _ స్నానమహిమ . ◆ శ్లో!! కార్తీకేమాసి రాజేంద్ర స్నానదాన జపాదికం! లేశంవాకురుతేమర్త్యః తదక్షయ్య ఫలం స్మృతమ్!! ఓ జనకమహారాజా! వినుము. # కార్తీకమాస మందు స్నానము దానము జపము మొదలయిన పుణ్యములలో ఏదయినను స్వల్పమైనా చేసినయెడల ఆస్వల్పమే అనంతఫలప్రదమగును. స్త్రీలుగాని , పురుషులుగాని , అస్థిరమైన శరీరమును నమ్ముకుని శరీరకష్టమునకు భయపడి కార్తీకవ్రతమును జేయని యెడల నూరుమారులు కుక్కగా పుట్టుదురు. కార్తీక పున్నమిరోజున స్నానదానములు ఉపవాసమును జేయని మనుష్యుడు కోటిమారులు చండాలుడై జన్మించును. అట్లు చండాలుడై పుట్టి చివకు బ్రహ్మ రాక్షసుడైయుండును. ఈవిషయమందొక పూర్వకథ గలదు. చెప్పెదను వినుము. ఆ ఇతిహాసము తత్వనిష్ఠునిదైయున్నది. గనుక దానిని వినుము. ఆంధ్రదేశమందు తత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు , అబద్ధమాడనివాడు , ఇంద్రిఅయములను జయించివాడు , సమస్త ప్రాణులందు దయగలవాడు , తీర్థయాత్రలందాసక్తి గలవాడు. రాజా! ఆబ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకుబోవుచు గోదావరీ తీరమందు ఆకాశమునంటి యున్నట్లుండు ఒక మర్రిచెట్టు మీద ముగ...