శ్రీ కార్తీక పురాణము 6వ అధ్యాయము
శ్రీ కార్తీక పురాణము 6 వ అధ్యాయము ◆ # దీపదానవిధి _ మహత్యం . ◆ ఏ మానవుడు # కార్తీకమాసం నెలరోజులూ పరమేశ్వరుని శ్రీమహావిష్ణువును , పంచామృత స్నానము చేయించి కస్తూరి కలిపిన మంచిగంధపు నీటితో భక్తిగా పూజించునో , అలాంటి వానికి అశ్వమేథ యాగము చేసినంత పుణ్యము దక్కుతుంది. అట్లే ఏ మానవుడు కార్తీకమాసమంతా దేవలయంలో దీపారధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. # దీపదానము చేయుట యెట్లనగా పైడిప్రత్తి తానే స్వయంగా తీసి శుభ్రపరచి , వత్తులు చేయవలెను. వరిపిండితో గాని , గోదుమపిండితోబ్గాని ప్రమిదవలె చేసి వత్తులు వేసి , ఆవునెయ్యి వేసి , దీపము వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునికి దానమియ్యవలెను. శక్తి కొద్ది దక్షణ కూడా ఇయ్యవలెను. ఈ ప్రకారంగా కార్తీకమాస మందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి నిండుగాపోసి వెనుకచేసిన ప్రకారంగా గోదుమపిండితో ప్రమిదను చేసి ఆవునెయ్యి పోసి దీపము వెలిగించి ఈ నెలరోజులు దానము ...