Posts

Showing posts with the label హారతులు ఎన్ని రకాలు?

హారతులు ఎన్ని రకాలు?

Image
  హారతులు   ఎన్ని   రకాలు ? ఓంకార _ హారతి :   సృష్టికి మూలం ఓంకారం. అమ్మవారిని సృష్టి స్వరూపిణిగా పిలుస్తుంటాం. ఓంకార నాదాన్ని వినడం వల్ల ,   ఓంకార రూపాన్ని చూడటం వల్ల పాపాలు తొలగిపోవడంతోపాటు శుభపరంపరలు కలుగుతాయని నమ్మకం. అందుకే తొలుత ఓంకార హారతితో శ్రీకారం చుట్టనున్నారు. నాగ _ హారతి : దేవతా స్వరూపమైన నాగ సర్పం దీర్ఘాయువుకు ,   పవిత్రతకు ప్రతీక. నాగహారతిని దర్శించడం వల్ల భక్తులకు సంతాన సౌభాగ్యం ,   రోగనివారణ కలుగుతుంది. సర్పదోషాలు తొలగుతాయి. జ్ఞానత్వం కూడా లభిస్తుంది. నాగదోషం ఉన్నటువంటి వ్యక్తులు జ్యోతి స్వరూపమైన హారతిని చూడటం వల్ల సకల శుభాలు జరుగుతాయని పురాణాల్లో చెబుతున్నారు. పంచ _ హారతి : సద్యోజాత ,   వామదేవ ,   అఘోర ,   తత్పురుష ,   ఈశా న అనే నామాలతో ఉన్న ఈశ్వరునికి ప్రతి రూపం పంచహారతి. ఈ హారతి దర్శనం వల్ల భక్తులకు పంచ మహాపాతకాలు నశిస్తాయి. పంచ ప్రాణాలకు సాంత్వన కలుగుతుంది. మల్లేశ్వరస్వామి వారి పరిపూర్ణ కటాక్షం లభిస్తుందని నమ్మకం. అదీకాకుండా అమ్మవారు కూడా పంచముఖాలతో ఉంటుంది. అందువల్ల పంచహారతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ...