హారతులు ఎన్ని రకాలు?

 హారతులు ఎన్ని రకాలు?

ఓంకార_హారతి : సృష్టికి మూలం ఓంకారం. అమ్మవారిని సృష్టి స్వరూపిణిగా పిలుస్తుంటాం. ఓంకార నాదాన్ని వినడం వల్ల, ఓంకార రూపాన్ని చూడటం వల్ల పాపాలు తొలగిపోవడంతోపాటు శుభపరంపరలు కలుగుతాయని నమ్మకం. అందుకే తొలుత ఓంకార హారతితో శ్రీకారం చుట్టనున్నారు.

నాగ_హారతి : దేవతా స్వరూపమైన నాగ సర్పం దీర్ఘాయువుకు, పవిత్రతకు ప్రతీక. నాగహారతిని దర్శించడం వల్ల భక్తులకు సంతాన సౌభాగ్యం, రోగనివారణ కలుగుతుంది. సర్పదోషాలు తొలగుతాయి. జ్ఞానత్వం కూడా లభిస్తుంది. నాగదోషం ఉన్నటువంటి వ్యక్తులు జ్యోతి స్వరూపమైన హారతిని చూడటం వల్ల సకల శుభాలు జరుగుతాయని పురాణాల్లో చెబుతున్నారు.

పంచ_హారతి : సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే నామాలతో ఉన్న ఈశ్వరునికి ప్రతి రూపం పంచహారతి. ఈ హారతి దర్శనం వల్ల భక్తులకు పంచ మహాపాతకాలు నశిస్తాయి. పంచ ప్రాణాలకు సాంత్వన కలుగుతుంది. మల్లేశ్వరస్వామి వారి పరిపూర్ణ కటాక్షం లభిస్తుందని నమ్మకం. అదీకాకుండా అమ్మవారు కూడా పంచముఖాలతో ఉంటుంది. అందువల్ల పంచహారతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది.

కుంభ_హారతి : సమాజానికి రక్షను కలిగించేది కుంభహారతి. మహిమాన్వితమైన కుంభ హారతిని దర్శించడం వల్ల భక్తులకు అనన్యమైన పుణ్యం, పంచ భూతాత్మకమైన జీవ రక్ష లభిస్తుంది. మనస్సు ప్రశాంతత సాధించాలనుకున్నా ఈ హారతిని ఒక్కసారి చూస్తే సరిపోతుందని పురాణాలు చెబుతున్నాయి.

సింహ_హారతి : దుర్గామాత అమ్మవారి వాహనం సింహం. శత్రువులను శిక్షించి, ధర్మాన్ని రక్షించే తత్వానికి, ధైర్యానికి సింహరూపం నిదర్శనం. సింహ హారతి దర్శనం వల్ల భక్తులకు విజయం, దుర్గ అనుగ్రహం లభిస్తుంది. మనలో ఉన్నటువంటి అసుర ప్రవృత్తి తొలగి సద్భావం పెంపొందుతుంది.

నంది_హారతి : ఈశ్వరుని వాహనంగా ఉన్న విమల ధవళ స్వరూపుడు నందీశ్వరుడు. ప్రథమ గణాల్లో ఒకరుగా నంది ప్రతీతి. పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన వాహనం. పుణ్యానికి, ధర్మానికి ప్రత్యక్షంగా కనిపించే శుభరూపుడు నంది. ఈ హారతి భక్తులకు నిర్మలమైన భక్తి సకల ధర్మాచరణ అనే ఫల ప్రాప్తి అందిస్తుంది. పరమేశ్వరుని అనుగ్రహంతో జ్ఞానత్వం లభిస్తుంది.

సూర్య_హారతి : లోకబాంధవుడు, కర్మసాక్షి అజస్ర, సహస్ర విజప్రభలతో వెలుగొందే సూర్యుడు దుర్గమ్మకు కుడికన్ను. సూర్య హారతి వల్ల భక్తులకు జ్ఞానము, ఆరోగ్యం లభిస్తుంది. దీనివల్ల ఆయుష్షు పెరుగుతుంది. దీన్ని దర్శించుకోవడం వల్ల మన శరీరానికి ఆరోగ్యం సిద్ధిస్తుంది.

చంద్ర_హారతి : పుడమిని, పాడి పంటలను, మనస్సును ప్రభావితం చేసే చంద్రుడు అమ్మవారికి ఎడమకన్ను. చంద్ర హారతి దర్శనం వల్ల భక్తుల్లో పరోపకార బుద్ధి, ధార్మికమైన మనస్సు, దానగుణం వృద్ధి చెందుతాయి. మనస్సుకు స్వచ్ఛత చేకూరడంతోపాటు ప్రశాంతత కలుగుతుంది.

నక్షత్ర_హారతి : 27 నక్షత్రాల్లోనే కోట్లాదిమంది మానవులు జన్మిస్తుంటారు. మానవ జీవనానికి నక్షత్రాలు మూలం. నక్షత్ర హారతి దర్శనం వల్ల భక్తులకు అక్షయమైన పుణ్యం సిద్ధిస్తుంది.

కృష్ణమ్మ హారతి వీక్షణతో పూర్ణ ఫలం లభిస్తుంది. దీనివల్ల మనస్సుకు ప్రశాతంత లభిస్తుంది. ఈ హారతిని ఆఖరుగా ఇస్తారు.

శుభమస్తు

|| ఓం శ్రీమాత్రేనమః ||

For Updates Follow & Join

ఫేస్ బుక్ గ్రూప్ Vasthu House Remedies

ఫేస్ బుక్ పేజీ Vasthu House

ఫేస్ బుక్ పేజీ Karnati Vanitha

Vasthu House Blog

Vasthu House Remedies E-Book

వాస్తు హౌస్ రెమిడీస్ E-పుస్తకం

Whatsapp +91 7013477841

ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారము & టాయిలెట్లు సరైన జోన్ లో వున్నాయా లేవా?

Main Entrance Doors & Toilets Located in Right Zone or Not?

Google Route MAP





Comments

Popular posts from this blog

రుద్రాభిషేకం ఎన్నిసార్లు చేయాలి?

Vasthu Tip (వాస్తు టిప్) 005

శ్రీ కేదారేశ్వర వ్రత కథ