బ్రహ్మపురాణం ప్రకారం, కార్తీక అమావాస్య నాడు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందట
బ్రహ్మపురాణం ప్రకారం , కార్తీక అమావాస్య నాడు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందట కార్తీకఅమావాస్య కార్తీక బహుళ అమావాస్య అనగా కార్తీక మాసములో కృష్ణ పక్షము నందు అమావాస్య తిథి కలిగిన రోజు. కార్తీక బహుళ అమావాస్యతో కార్తీకమాసం ముగిసిపోతుంది కనుక , ఈ రోజున దైవారాధనలో మరింతసేపు గడపడానికి ప్రయత్నించాలి. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున తెల్లవారుజామునే కార్తీకస్నానం చేసి ఇంట్లో తులసికోట వద్ద దీపం వెలిగించాలి. తరువాత శివాలయానికి గానీ , విష్ణాలయానికి గానీ వెళ్ళి ఆవునేతితో రెండు దీపాలను ఆలయం వద్ద వెలిగించి స్వామి దర్శనం చేసుకోవాలి. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఆవునేతి దీపాలు వెలిగించి మహాలక్ష్మిని ఆరాధించినట్లయితే లక్ష్మీకటాక్షం తప్పక కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.కార్తీక అమావాస్య అయిన ఈ నెల 22 వ తేదీన పితృకార్యాలను నిర్వహిస్తే శుభఫలితాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. కార్తీకమాసంలో తులసితో శ్రీమహావిష్ణువును , బిల్వదళాలతో శివుడినీ , కుంకుమ పూజతో అమ్మవారిని సేవించడం వలన కలిగే ఫల...