బ్రహ్మపురాణం ప్రకారం, కార్తీక అమావాస్య నాడు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందట
బ్రహ్మపురాణం ప్రకారం, కార్తీక అమావాస్య నాడు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందట
కార్తీక బహుళ అమావాస్య అనగా కార్తీక మాసములో కృష్ణ పక్షము నందు అమావాస్య తిథి కలిగిన రోజు.
కార్తీక బహుళ అమావాస్యతో కార్తీకమాసం ముగిసిపోతుంది కనుక, ఈ రోజున దైవారాధనలో మరింతసేపు గడపడానికి ప్రయత్నించాలి. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున తెల్లవారుజామునే కార్తీకస్నానం చేసి ఇంట్లో తులసికోట వద్ద దీపం వెలిగించాలి. తరువాత శివాలయానికి గానీ, విష్ణాలయానికి గానీ వెళ్ళి ఆవునేతితో రెండు దీపాలను ఆలయం వద్ద వెలిగించి స్వామి దర్శనం చేసుకోవాలి. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఆవునేతి దీపాలు వెలిగించి మహాలక్ష్మిని ఆరాధించినట్లయితే లక్ష్మీకటాక్షం తప్పక కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.కార్తీక అమావాస్య అయిన ఈ నెల 22వ తేదీన పితృకార్యాలను నిర్వహిస్తే శుభఫలితాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. కార్తీకమాసంలో తులసితో శ్రీమహావిష్ణువును, బిల్వదళాలతో శివుడినీ, కుంకుమ పూజతో అమ్మవారిని సేవించడం వలన కలిగే ఫలితాలు విశేషమైనవని అలాగే ఈ మాసంలో వచ్చే అమావాస్య రోజున పితృకార్యాలను నిర్వహించే వారికి వంశాభివృద్ధి చేకూరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
కార్తీక బహుళ అమావాస్య రోజున పితృకార్యాలను నిర్వహించడం వలన వాళ్లు సంతోషించి సంతృప్తిని చెందుతారని పండితులు అంటున్నారు. పితృదేవతల ఆశీస్సులను కోరుకునేవాళ్లు ఈ రోజున పూజలు, తర్పణాలు ఇవ్వడం మంచిది.
కార్తీక అమావాస్య 'కమలాజయంతి' గా చెప్పబడుతోంది కనుక అంతా తమ ఇంట దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించవలసి ఉంటుంది. అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీదేవిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
బ్రహ్మ పురాణం ప్రకారం, కార్తీక అమావాస్య నాడు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందట. ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేసి దీపాన్ని వదిలితే పుణ్యం వస్తుందని అంటారు.
జనాదరణ పొందిన నమ్మకాల ప్రకారం, కార్తీక అమావాస్య నాడు ఏదైనా పవిత్రమైన ఆచారాన్ని నిర్వహించడం లేదా పవిత్ర నదులు, సరస్సులు లేదా చెరువులలో స్నానం చేయడం వల్ల మీ చెడు పనులన్నీ తగ్గుతాయి మరియు మీకు మోక్షాన్ని అందిస్తాయి.
కార్తీక కృష్ణ పక్షం అన్ని పాపాలను పోగొట్టమని విష్ణువును ప్రార్థించడానికి ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుంది. లక్ష్మీ దేవిని మరియు విష్ణువును ప్రార్థించడం మరియు కార్తీక అమావాస్య వ్రతాన్ని ఆచరించడం వల్ల స్థానికుల అన్ని కోరికలు నెరవేరుతాయి.
కార్తిక అమావాస్య నాడు పంచ పల్లవాలతో(రావి, మర్రి, జువ్వి, మోదుగు, మేడి) అభ్యంగన స్నానమాచరించాలి. దీనిని పంచత్వక్ ఉదక స్నానం అని అంటారు. అశ్వయుజ మరియు కార్తిక అమావాస్యల నాడు స్వాతి నక్షత్రం కలిసి ఉండే అవకాశం ఉంది కావున ఆశ్వయుజ అమావాస్య నాడు చేసే అన్ని విధులు కార్తిక అమావాస్య నాడు కూడా ఆచరించాలి. స్వాతి నక్షత్రం పాడ్యమి లేదా విదియ నాడు ఉన్నా అభ్యంగన స్నానమాచరించాలి. దారిద్య్రాన్ని తొలగించుటకు లక్ష్మీపూజ చేయవలెను.
స్వాతిస్థితే రవా విందు: యది స్వాతి గతో భవేత్
పంచత్వ గుదకస్నాయీ కృతాభ్యంగ విధిర:
నీరాజితో మహాలక్ష్మీమ్ అర్చయన్ శ్రియమశ్నుతే
అనగా సూర్యుడు స్వాతి నక్షత్రంలో ఉండగా లేదా చంద్రుడు స్వాతి నక్షత్రంలో ఉండగా పంచత్వక్ ఉదకములతో అభ్యంగన స్నానమాచ రించి లక్ష్మీనారాయణులకు నీరాజనమిచ్చినచో సంపదలు పొందుతారు. ఆశ్వయుజ కార్తికములే కాక ప్రతీ అమావాస్య మరియు సంక్రమణం నాడు అభ్యంగన స్నానం ఆచరించి రోజంతా ఉపవసించి శక్తి మేర దీపాలను వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఈయవలెను. ప్రదోష సమయంలో స్నానమాచరించి దేవాలయాల్లో, ఇంటిలో, దేవతా వృక్షాల వద్ద, కూడళ్ళలో దీపాలు వెలిగించి బ్రాహ్మణులను, పెద్దలను పూజించి భోజనం చేయాలి.
హేమాద్రి పురాణానుసారం సూర్యుడు తులా రాశిలో ఉన్నప్పడు ప్రదోష సమయమున దివిటీలతో, ఆకాశదీపాలతో పితృదేవతలకు దారి చూపవలెను. అలాగే ఆశ్వయుజ, కార్తిక అమావాస్యల నాడు రాత్రి నిద్రించరాదు. ఆరోజు అర్థరాత్రి లక్ష్మీదేవి పురవీధులలో ఆకాశమార్గమున సంచరిస్తూ ఉంటుంది కావున ఇంటి వాకిలిలో, ఇంట్లో ముగ్గులు, తోరణములు, దీపాలతో అలంకరించి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతూ స్తోత్రములు, పూజలు చేయవలెను. ఈవిధంగా చేయని వారింటికి లక్ష్మీదేవి చేరదని పురాణ వచనం. అమావాస్య అపర రాత్రి దాటిన పిదప అనగా బ్రాహ్మీ ముహూర్తంలో జనులు డప్పులతో అలక్ష్మి(దారిద్య్రం)ని తరిమివేయాలి.సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు
! స్వస్తి
For Updates Click Below & Join
ఫేస్ బుక్ గ్రూప్ Vasthu House Remedies
ఫేస్ బుక్ పేజీ Vasthu House
ఫేస్ బుక్ పేజీ Karnati Vanitha
వాస్తు హౌస్ రెమిడీస్ E-పుస్తకం
ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారము & టాయిలెట్లు సరైన జోన్ లో వున్నాయా లేవా?


Comments
Post a Comment