హారతి దీపం విశిస్టతలు ఏమిటి ఎన్ని రకాలు ఎన్ని వత్తులు

 హారతి దీపం విశిష్టతలు ఏమిటి ఎన్ని రకాలు ఎన్ని వత్తులు?


హారతి దీపం విశిష్టతలు ఏమిటి? ఎన్నిరకాలు, ఎన్ని వత్తులు..........!!

శ్రేష్ఠమైన నేతిలో మూడు వత్తులతో వెలుగొందుచూ, మూడులోకాల యొక్క గాడాంధకారాన్ని పోగొట్ట గల మంగళప్రదమైన జ్యోతిత్రయాన్ని వెలిగించి సర్వాంతర్యామియైన నీకు భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. దివ్య జ్యోతి స్వరూపమైన ఓ దైవమా! నన్ను ఈ ఘోర నరకం నుండి రక్షించు.

ఇలా స్వామిని వేడుకుంటూ దీపారాధన చేస్తూ హారతులనిస్తుంటాం. హారతి భక్తునిలోని ఆత్మకు ప్రతీక. హారతి భక్తునిలో ఓ దివ్య తేజాన్ని కలిగిస్తుంది. ఆ పరంధామునిపై మనసును లగ్నం చేయడానికి హారతి ఉపకరిస్తుంది.

దీపాలను పట్టుకుని దైవం ముందు తిప్పే విషయాలను గురించి ఆగమాలలో చెప్పబడింది. దీప షోడశోపాసన అంటూ రకరకాల హారతి పద్ధతులను గురించి వివరించబడింది. 3,5,7 నుంచి 251 వరకు తిప్పే హారతుల పద్ధతులున్నాయి. హారతిని దైవం ముందు వెలిగించి తిప్పడాన్ని దీప నిరంజనమని కూడ అంటారు. కర్పూరాన్ని వెలిగించడం ద్వారానో, లేక మూడు, ఐదు, ఏడు వత్తులను నేతిలో ముంచి వెలిగించిన దీపంతోనో హారతిని ఇస్తుంటారు. సాధారణంగా హారతి, పూజకు ముగింపు సమయాలలో ఉంటుంది. ఈ హారతి సేవను చూసిన వారి జీవితాల నుంచి, లేక హారతి సేవను చేసిన వారి జీవితాల నుంచి పెనుచీకటి తొలగిపోయి వెలుగురేఖలు వెల్లివిరుస్తాయనేది పెద్దలవాక్కు.

హారతులను ఇచ్చేందుకు రకరకాల హారతి పళ్ళాలను తయారు చేస్తుంటారు. కుంభ (బిందె), కూర్మ (తాబేలు), నాగ (ఏడుతలలపాము) గోపుర రూపాలలోనున్న హారతి పళ్ళాలను మనం చూడగలం. సాధారణంగా హారతి ఇచ్చేందుకు వెడల్పాటి పళ్ళెం ఉపయోగించ బడుతుంటుంది. కొన్ని కొన్ని సార్లు చిన్న పళ్ళాలు లేక గరిటెరూపంలో హారతి వస్తువులను ఉపయోగిస్తుంటారు.

అసలు స్వామికి హారతిచ్చే దీపస్తంభమే ఒక మోస్తరు దైవమనే చెప్పాలి. దీపస్తంభపు పైభాగం అగ్నికి ప్రతిరూపం కాగా, పిడిభాగం ఈశ్వర ప్రతిరూపం, అడుగుభాగం ప్రజాపతికి ప్రతిరూపం. ఆ దీపపు స్తంభాన్ని పైకి, కిందికి తిప్పుతున్నప్పుడు సూర్యుడు, అగ్నికి ప్రతిరూపంగా చెప్ప బడుతుంది. అలా హారతి ఇస్తూ తిప్పే దీపాలలో రకాలున్నాయి.

 ఒకే ఒక దీపం  ఏకహారతిఇంకా రెండు, మూడు ఐదు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది దీపాలతో కూడిన హారతి దీపపు సెమ్మెలుంటాయి.

 పాము ఆకృతిలో ఉండే దీపపు సెమ్మెలను నాగదీపమని,

 రథాకారం  రథదీపం,

 మనిషి  పురుషదీపం,

 కొండ  మేరు దీపం,

 శివపంచాకృతులు  పంచబ్రహ్మదీపం,

 ఏనుగు ఆకారం  గజ దీపం,

 ఎద్దు ఆకారం  వృషభ దీపం,

 కుండ  కుంభ హారతి దీపం అని అంటారు.

అదేవిధంగా దీపపు సెమ్మెల సంఖ్యను బట్టి, ఆకారాన్ని బట్టి వాటికి సంబంధించిన అధిదేవతలను కూడా పేర్కొన్నారు.

 ఏకహారతి  మహేశ్వరుడు

 ద్విహారతి  ఉమా మహేశ్వరులు

 త్రిహారతి  బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు

 పంచహారతి  పంచభూతాలు

 సప్తహారతి  సప్త ఋషులు

 అష్టహారతి  అష్టమూర్తులు

 నవహారతి  తొమ్మిది గ్రహాలు

 దశహారతి  దిశానాయకులు

 నాగదీపహారతి  వాసుకి

 రథదీపహారతి  సదాశివుడు

 మేరుదీపహారతి  బ్రహ్మ

 వృషభదీపహారతి  నంది

 పురుషదీప హారతి  శరభేశ

 పంచబ్రహ్మాదీప హారతి  పంచముఖశివుడు

 ఏకహారతి : ఏక హారతి విధానంలో ఒక దీపపు సెమ్మెలో ఒకే ఒక వత్తి ఉంటుంది.

 పంచహారతి : పంచహారతిలో ఐదు దీపపు సెమ్మెలలో ఐదు వత్తులుంటాయి. శైవాలయాలలో ఐదు పడగల ప్రతిమతో కూడిన దీపపు సెమ్మె ఉంటుంది. ఇందులో ఒక పడగ రాహువుకి ప్రతీక కాగా, మిగతావి కేతువుకి ప్రతీకలని అంటారు. ఇలాంటి హారతిని నాగహారతి లేక నాగదీపమని అంటారు. శ్రీరంగంలో పంచహారతి జరుగుతుంటుంది.

 కూర్మహారతి : తాబేలు ఆకారంలో చేయబడిన హారతి పళ్ళానికి పదహారు వత్తులు అమర్చే వీలుంటుంది. ఈ హారతి పళ్ళాలను వెండితో చేస్తారు.

 రథహారతి : దీపపు సెమ్మెలు రథాకారంలో అమర్చబడి ఉంటాయి. ఒక్కొక్కవరుసలో ఐదు వత్తులుంటాయి. పుష్పాకృతులతో అలంకరించబడిన పిడి ఉంటుంది. ఈ రథహారతి హిందూ దేవాలయాలతోపాటు జైన దేవాలయాలలో కూడ చూడగలం.

 చంద్రదీపం : ఈ దీప హారతి నెలవంక ఆకృతిలో ఉంటుంది.

 నారాయణహారతి : పదిహేను వత్తుల వెండిహారతి పళ్ళెం.

 కుంభహారతి : అన్ని రకాలైన హారతులను ఇచ్చిన తరువాత కుంభహారతితో ముగింపు పలుకుతుంటారు.

 ధూపహారతి : సాంబ్రాణి పొగతో ఇవ్వబడే హారతి.

 కర్పూరహారతి : కర్పూరాన్ని వెలిగించి ఇచ్చే హారతి.

మనం హారతి పళ్ళాలను, లేక దీపాలను త్రిప్పుతున్నప్పుడు, ఏ పద్ధతిలో త్రిప్పాలన్న విషయమూ చెప్పబడింది. ముందుగా హారతితో దైవం ముందు త్రిప్పుతున్నప్పుడు, దైవం యొక్క తల భాగం నుంచి పాదాలవరకు దీప హారతిని త్రిప్పాలి. రెండవసారి తిప్పే హారతి స్వామి ముఖం నుండి మోకాళ్ళవరకు, మూడవ సారి తిప్పే హారతి మెడ, నడుము భాగాల మధ్య తిప్పాలని చెప్పబడింది. దైవం ముందు ఒకటికి లేక మూడు, ఐదు, ఏడు తొమ్మిది దీపాలతో కూడిన హారతులిస్తుంటారు. దేవాలయాలలో దీపహారతిని ఇచ్చేముందు మంత్రజలాన్ని చిలకరించి, హారతిపళ్ళెం పిడిపై ఒక పుష్పాన్ని ఉంచి, తగిన హస్త ముద్రతో హారతిని స్వామి ముందు తిప్పుతూ ఆముఖ దేవతాభ్యో నమః దీపం సమర్పయామి అనే మంత్రాన్ని పఠిస్తారు. హారతి పళ్ళానికి పిడి తప్పనిసరి. సాధారణంగా హారతి పళ్ళాలను ఇత్తడితో చేస్తుంటారు. వెండి హారతి పళ్ళాలను విరివిగా ఉపయోగిస్తుంటారు. కొన్ని కొన్ని దేవాలయాలలో దీపపు హారతులను ఏక, పంచహారతి సంఖ్యలుంటాయి.

శుభమస్తు

|| ఓం శ్రీమాత్రేనమః ||

For Updates Follow & Join

ఫేస్ బుక్ గ్రూప్ Vasthu House Remedies

ఫేస్ బుక్ పేజీ Vasthu House

ఫేస్ బుక్ పేజీ Karnati Vanitha

Vasthu House Blog

Vasthu House Remedies E-Book

వాస్తు హౌస్ రెమిడీస్ E-పుస్తకం

Whatsapp +91 7013477841

ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారము & టాయిలెట్లు సరైన జోన్ లో వున్నాయా లేవా?

Main Entrance Doors & Toilets Located in Right Zone or Not?

Google Route MAP


Comments

Popular posts from this blog

రుద్రాభిషేకం ఎన్నిసార్లు చేయాలి?

Vasthu Tip (వాస్తు టిప్) 005

శ్రీ కేదారేశ్వర వ్రత కథ