మార్గశిర మాసంలో విష్ణువును ఆరాధించాలి
మార్గశిర మాసంలో విష్ణువును ఆరాధించాలి
మృగశిర నక్షత్రం కలసి పౌర్ణమినాడు చంద్రుడు
ఉదయించేనెల మార్గశీర్ష మాసం. “మాసానాం మార్గశీర్షోహం” అని కృష్ణుడు స్వయంగా చెప్పాడు. కనుక మార్గశిరమాసం విష్ణుదేవుని రూపం. భాద్రపదంలో గణపతిని, ఆశ్వయుజంలో అమ్మవారిని, కార్తీకంలో శివుని, మార్గాశిరంలో విష్ణువును, పుష్యమాసంలో సూర్య
భగవానుని ఇలా అయిదు మాసాలలో అయిదు దేవతా స్వరూపాలను అర్చిస్తూ పంచాయతన పూజా
విధానాన్ని సుష్టు పరచారు. సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి
చలిబాధ ఉండదు. బ్రాహ్మీముహూర్తంలో నీటిలో అగ్ని, సూర్యుడు
కలసి ఉంటారని శాస్త్రం. అందువల్ల బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం, సంధ్యావందన జప ధ్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి, అగ్నితేజము కూడా మన మనస్సును, బుద్ధిని ప్రచోదనం
చేస్తాయి. అందుకే మార్గశిర మాసంలో ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారు
ఝామున నిద్రలేచి స్నానం చేయడం ఆచారమైంది. నందవ్రజంలోని గోపికలు పరమేశ్వరుడైన
విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణునిలో అద్వైత స్థితిని పొందగోరి మార్గశిర మాసంలో వ్రతం
ఆచరించారు.
ఈ నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేసి, పోలిని జ్ఞాపకం తెచ్చుకుని నదులలో దీపాన్ని విడిచిపెట్టాలి.
ఈ నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేసి, పోలిని జ్ఞాపకం తెచ్చుకుని నదులలో దీపాన్ని విడిచిపెట్టాలి.
ఈ మాసంలో విష్ణువును 'కేశవ' నామంతో అర్చిస్తాం.
! స్వస్తి
|| ఓం శ్రీమాత్రేనమః ||
For Updates Click Below & Join
ఫేస్ బుక్ గ్రూప్ Vasthu House Remedies
ఫేస్ బుక్ పేజీ Vasthu House
ఫేస్ బుక్ పేజీ Karnati Vanitha
వాస్తు హౌస్ రెమిడీస్ E-పుస్తకం
ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారము & టాయిలెట్లు సరైన జోన్ లో వున్నాయా లేవా?


Comments
Post a Comment