ఈశ్వర ఆరాధన
ఈశ్వరఆరాధన ...
కార్తిక మాసంలో
పరమేశ్వరుడుని ఆరాధించినా, అభిషేకించినా, భక్తితో బిల్వపత్రం సమర్పించినా ముక్తి లభిస్తుంది.
లఘురుద్రాభిషేకం:
ఒరిస్సాలోని కోణార్క్‌లోని శివలింగం ‘సూర్యలింగం’.. సూర్యరూపధారియైన శివునకు లఘు రుద్రాభిషేకం ప్రీతి.
లఘురుద్రాభిషేకం చేస్తే పునర్జన్మ ఉండదని శాస్త్ర వచనం.
మహారుద్రాభిషేకం:
భటగావ్‌లోని శివలింగం చంద్రనాధ లింగం. ‘చంద్రలింగం’. చంద్రరూపధారియైన శివునకు మహా రుద్రాభిషేకం ఇష్టం.
మహారుద్రాభిషేకంతో జ్ఞానాభివృద్ధి.
అతిరుద్రాభిషేకం:
ఖట్మండువద్ద త్రినాధ క్షేత్రంలోని పశుపతి లింగం ‘యజలింగం’ సర్వరూపధారియైన శివునకు అతి రుద్రాభిషేకం ప్రీతిని
కలిగిస్తుంది. అతిరుద్రాభిషేకంవల్ల అఖండ పుణ్యం,ముక్తి
చేకూరుతుంది.
శివలింగానికి ఆవుపాలతో సంతాన ప్రాప్తి ,
బిల్వపత్రం ఉంచిన నీటితో ఆయువు ఆరోగ్య అభివృద్ధి,
స్వచ్ఛమైన నీటితో సకాల వర్షాలు,
కొబ్బరినీరు, తేనె, పండ్లరసం, చెరుకురసం, నేయి లాంటివాటితో అభిషేకం చేస్తే సకల పాపాలు నశించి ఆరోగ్యం, ఐశ్వర్యం వంశాభివృద్ధి జరుగుతుంది
శివాభిషేకంలో..మహన్యాసం, లఘున్యాసం, నమకం,చమకం, పురుష సూక్త, శ్రీసూక్త, మన్యుసూక్త మంత్రాలు, దశ శాంతుల మంత్రాలు అది ఏకవార అభిషేకం అయినా, ఏకాదశ రుద్రాభిషేకమైనా విధిగా చెప్పాలి.
శివపూజకు బిల్వపత్రాలు వినియోగించాలి?
మారేడు చెట్టునే బిల్వవృక్షమని, శ్రీ వృక్షమని అంటారు.
ఈ బిల్వపత్రాలతో శివపూజ
చేసిన వారికి మరుజన్మ ఉండదు.
ఒక్క మారేడు దళం లక్ష
బంగారు పువ్వులకు సమానమని శివపురాణంఅంటుంది.
బిల్వ వృక్షాన్ని పెరట్లో
పెంచితే అశ్వమేధ యాగం చేసిన ఫలం చేకూరుతుంది.
వెయ్యిమందికి అన్నదాన ఫలం
లభిస్తుంది.
నిత్యం బిల్వపత్రితో శివుని
పూజిస్తే ఐశ్వర్యవంతులవుతారు.
మారేడు చెట్టుకింద కూర్చుని ‘నమఃశివాయ’ పంచాక్షరీ మంత్రం జపం చేస్తే మంత్రసిద్ధి లభ్యం అవుతుంది.
ఆరోగ్యరీత్యా మారేడు చెట్టు
వేరు, ఆకు రసము, కషాయం చలువ, మేహశాంతి, పైత్యశాంతి, జఠర దీప్తిని కలిగిస్తుంది. జ్వరము హరిస్తుంది.
రుద్రుడు, శంకరుడు, భవుడు, ఉగ్రుడు, భీముడు,పశుపతి, ఈశానుడు, మహాదేవుడు, ఇలా శివునకు ఎన్నేన్నో నామాలున్నాయి వీటిలో ఏది పిలిచినా శివుడు అభయం ఇచ్చి
తీరుతాడు.
అసలు శివా అనే రెండు
అక్షరాలు పలికితే చాలు శివసాయుజ్జం లభించినట్లే.
ఈశ్వరుడు
పంచకృత్యపారాయణుడని వాయుపురాణం అంటుంది.
సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం అనేవి ఈ పంచకృత్యాలు.
భక్తసులుభుడైన శివుడిని అటు
మానవులు ఇటు దానవులే కాదు శ్రీరాముడు అనుక్షణం శివధ్యానం చేస్తుంటాడు.
స్వస్తి
For Updates Click Below & Join
ఫేస్ బుక్ గ్రూప్ Vasthu House Remedies
ఫేస్ బుక్ పేజీ Vasthu House
ఫేస్ బుక్ పేజీ Karnati Vanitha
వాస్తు హౌస్ రెమిడీస్ E-పుస్తకం
ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారము & టాయిలెట్లు సరైన జోన్ లో వున్నాయా లేవా?


Comments
Post a Comment