కార్తిక సోమ వారానికి గల ప్రత్యేకత
కార్తిక సోమ వారానికి గల ప్రత్యేకత
#కార్తికమాసం లో వచ్చే సోమవారాలకు ఓ
ప్రత్యేకత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్నినక్షత్రాలలో
మొదటిదైన కృత్తికకు అధిపతిగా ఉండటం, చంద్రుడు
పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం చేత ఈ మాసంలోని సోమవారాలకు విశిష్టత ఉంది. కాబట్టి
చంద్రుని వారమైన కార్తికసోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైందని వారు చెబుతున్నారు.
ఈ వారంలో ముత్తైదువులు భక్తిశ్రద్ధలతో శివుడిని
కొలిస్తే మాంగల్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసం. ఇంకా చెప్పాలంటే ఈ సోమవారాల్లో
శైవభక్తులు నిష్టనియమాలతో శివునిని ఆరాధిస్తారు. సోమవారం సూర్యోదయానికి పూర్వమే
బ్రహ్మముహూర్తమున స్నానమాచరించి “హరహరశంభో” అంటూ శివుణ్ణి స్తుతిస్తే పాపాల నుంచి
విముక్తి లభించడంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ మాసమంతా ఉపవాసముండి శివునిని
కొలిస్తే కైలాసవాసం సిద్ధిస్తుందని శాస్త్రోక్తం.
సోమవారం ఉదయం స్నానాదికార్యక్రమాలను పూర్తి చేసుకుని, పొడిబట్టలు ధరించి మొదటగా దీపారాధన
చేయాలి. అనంతరం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించాలి. ఈ
విధంగా చేయడం ద్వారా నిత్య సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో వర్ధిల్లుతారని
విశ్వాసం. ఈ మాస ప్రారంభం నుంచి సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి, స్త్రీలు నదులలో, కోనేటిల్లో దీపాలు వదులుతారు.
కార్తిక మాసంలో దీపాన్ని దానం ఇస్తే… మాంగల్యబలం,
కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయని ఐతిహ్యం. ఇలా సోమవారాల్లో మాత్రమే
కాకుండా కార్తిక మాసమంతా నిత్యదీపారాధనతో శివుడిని ప్రార్థిస్తే సకల
సంపదలుచేకూరుతాయి.
◆ #కార్తిక_సోమవారాల్లో_నదీస్నానం_దీపారాధనచేస్తే ◆
సాధారణంగా ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ
నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే మాసానికి వస్తుంది. అలా కృత్తికా నక్షత్రంపై
చంద్రుడు పూర్ణుడై ఉండటం వల్ల ఈ మాసానికి ‘కార్తీకమాసమ’ని పేరు. ఈ మాసంలో కృత్తికా నక్షత్రానికి,
దీపారాధనకు, సోమవారాలకు ప్రాధాన్యత ఉంది.
అలాగే కార్తీక మాసాల్లో వచ్చే సోమవారాల్లో మాత్రమే
గాకుండా, మంగళవారాల్లో
పెళ్లికాని అమ్మాయిలు, వివాహితులైన మహిళలు గౌరీదేవిని
నిష్టతో పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు
అంటున్నారు. కార్తిక మాసంలో వచ్చే సోమవారం శివునికెంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో
వచ్చే సోమవారాల్లో శివుణ్ణి ఆరాధించేవారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని
విశ్వాసం. అలాగే కార్తీక మాసంలో వచ్చే ప్రతీరోజూ ఆదిదంపతులను ప్రార్థించేవారికి
ఈతిబాధలు తొలగిపోతాయి. అందుచేత కార్తిక సోమ, మంగళవారాల్లో
వివాహిత, అవివాహితులు శివాలయాలకు చేరుకుని, నేతితో దీపమెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది. ఇలాచేస్తే
వివాహం, సుఖసంతోషాలు, సకలసంపదలు,
వాహనయోగం వంటివి చేకూరుతాయి.
◆ #కార్తీక_సోమవారాల్లో_నదీస్నానాలు_చేస్తే_ఎలాంటి_ఫలితాలుంటాయంటే
లోకరక్షకుడైన సూర్యభగవానుడు కార్తికమాసంలో వేకువ
వేళల్లో సూర్యుడు తులారాశిలో సంచరిస్తున్నప్పుడు నదీస్నానం చేయడం చాలా మంచిది.
మనఃకారకుడైన చంద్రుని ప్రభావం దేహంపైన, మనస్సుపైన ఉంటుంది. మానసిక దేహారోగ్యానికి కార్తిక మాసంలో కొంత ఇబ్బంది
ఏర్పడుతుంది. దీనిని నివారించడానికి ప్రతి సోమవారం లయకారకుడైన శివుడిని
ధ్యానించాలి. అలాగే ఈ నెలరోజుల పాటు భక్తులు సాత్వికాహారం పరిమితంగా తీసుకోవడం
వల్ల ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా సోమవారాల్లో లక్షతులసి దళాలు లేదా బిల్వపత్రాలు,
మారేడు దళాలతో గాని శివపూజ చేస్తే మహత్తరశక్తి కలుగుతుంది.
For Updates Click Below & Join
ఫేస్ బుక్ గ్రూప్ Vasthu House Remedies
ఫేస్ బుక్ పేజీ Vasthu House
ఫేస్ బుక్ పేజీ Karnati Vanitha
వాస్తు హౌస్ రెమిడీస్ E-పుస్తకం
ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారము & టాయిలెట్లు సరైన జోన్ లో వున్నాయా లేవా?


Comments
Post a Comment