మార్గశిర లక్ష్మి వార వ్రతం

                                                 మార్గశిర లక్ష్మి వార వ్రతం


మార్గశిర లక్ష్మివార వ్రతం..

#మార్గశిరమాసం
 లో వచ్చే #గురువారం లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మివార వ్రతము అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిరమాసం నాడు ఈ పూజను ఆచరించడము సర్వశ్రేష్టము. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతమును ఆచరించుటవల్ల ఋణ సమస్యలు తొలగి, శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం.

ఈ సంవత్సరమందు మార్గశిర లక్ష్మివారముల తేదీలు:

నవంబరు 24వ తేదీ గురువారం
డిశంబర్ 1వ తేదీ గురువారం
డిశంబర్ 8వ తేదీ గురువారం
డిశంబర్ 15వ తేదీ గురువారం
డిశంబర్ 22వ తేదీ గురువారం

 #మార్గశిరలక్ష్మివారవ్రతవిధానం :

మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయమునే నిద్రలేచి ఇళ్ళు శుభ్రం చేసి, తలస్నానం చేయవలెను. ప్రత్యేకించి పూజ ముగిసే వరకు, చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహంను పూజకు సిద్ధం చేసుకోవలెను.

ఆదౌ పూజ్యో గణాధిపఃఅని మొట్టమొదట 
#గణపతికి ప్రథమ పూజ చేయవలెను. గణపతి పూజ అనంతరం, లక్ష్మీ అమ్మవారికి అధాంగ, #షోడశోపచార మరియు #అష్టోత్తరపూజ ను చేయాలి. నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి. మార్గశిర లక్ష్మీ పూజ, కథ చదువుకొని అక్షతలను శిరస్సున ధరించాలి.

లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురవారాలు చేస్తారు. కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో వుంటాయి కానీ ఈ లక్ష్మి పూజ 
#పుష్యమాసం లో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేయాలి అదే ఇక్కడ విశేషం.

మార్గశిర లక్ష్మివార వ్రతం సమయంలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యములు:

1 వ గురువారం పులగం

2 వ గురువారం అట్లు, తిమ్మనం

3 వ గురువారం అప్పాలు, పరమాన్నము

4 వ గురువారం చిత్రాన్నం, గారెలు

5 వ గురువారం పూర్ణం బూరెలు


 #మార్గశిర_లక్ష్మివార_వ్రతకధ:

Link : 
https://bit.ly/3gqp0St

 #లక్ష్మీఅమ్మవారి_మంగళహారతిపాట:

లక్ష్మీదేవ్మ- మంగళ హారతి ఇది గో
అనురాగంబులో- నిన్నువేడి తిని
క్షీర సాగర తనయా ఆది లక్ష్మీ ప్రార్ధంచితిని || లక్ష్మీ

వనస బత్తాయా దానిమ్మ ఖర్జూర

తేనెలూ రేటి తీ పైన పండ్లు

కన్నతల్లి కమలాఫలాలు

ఉంచినాఫమ్మ- దయాసేయవమ్మా || లక్ష్మీ మల్లె పుష్పాలు మందార పూలు

తెల్ల గన్నేరు చెంగల్ప పూలు

పళ్ళేరములో- మధుపాయసాలు
తల్లి ఉన్నాయి దయ సేయమ్మా || లక్ష్మీ

భక్తితో గొలిచేటి నీ భక్త వరులం

నిజముగా నిన్ను నమ్మేము నిరంతరం

శ్రీ హరి ప్రియమమ్ము కాపాడుమమ్మా
సకల సౌఖ్యాలు చేకూర్చు మాతా ||


|| ఓం శ్రీమాత్రేనమః ||

! స్వస్తి


|| ఓం శ్రీమాత్రేనమః ||

For Updates Click Below & Join

ఫేస్ బుక్ గ్రూప్ Vasthu House Remedies

ఫేస్ బుక్ పేజీ Vasthu House

ఫేస్ బుక్ పేజీ Karnati Vanitha

Vasthu House Blog

Karnati Vanitha Blog

Vasthu House Remedies E-Book

వాస్తు హౌస్ రెమిడీస్ E-పుస్తకం

Whatsapp +91 7013477841

ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారము టాయిలెట్లు సరైన జోన్ లో వున్నాయా లేవా?

Main Entrance Doors & Toilets Located in Right Zone or Not?

Google Route MAP


 

Comments

Popular posts from this blog

రుద్రాభిషేకం ఎన్నిసార్లు చేయాలి?

Vasthu Tip (వాస్తు టిప్) 005

శ్రీ కేదారేశ్వర వ్రత కథ