సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు ఆచరించమని చెప్పిన నోము ఏమిటో తెలుసా?

 సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు ఆచరించమని చెప్పిన నోము ఏమిటో తెలుసా.....?




#మారేడు_దళాల_నోము

సంతోష సౌభాగ్యాలని ప్రసాదించే మారేడు దళాల నోము

హిందూ పురాణాల ప్రకారం ఆ పరమేశ్వరునికి మారేడు దళాలు అంటే ఎంతో ప్రీతికరమైనది.

నోములు, వ్రతాలు రెండింటినీ మన సౌభాగ్యవతులు చేస్తూ ఉంటారు. వీటిల్లో పురాణాలలో ఉపదేశించిన వాటిని వ్రతాలని వ్యవహరిస్తారు. సంప్రదాయానుసారంగా వచ్చేవి నోములు. అంటే మూలం పురాణంలో దొరకక పోయినా సంప్రదాయాను సారంగా వీటిని ఆచరిస్తారు. వీటిల్లో ఎక్కువ భాగం నోములకు మంత్రాలు కూడా ఉండవు. అటువంటిదే సంతోష సౌభాగ్యాల కోసం మహిళలు నోచుకునే మారేడు దళాల నోము.

కథ : సతీ సహగమనం ఆచారంగా ఉన్న రోజులవి. రాజులు రాజ్యాలు ఉన్న కాలమది. ఒక రాజుగారు కొడుకు చనిపోయాడు. తన కొడుకుకి దహనసంస్కారాలు చేసేముందు ఆ రాజుగారు, ఆ శవానికి తోడుగా ఎవరినైనా తీసుకురమ్మని భటులని ఆజ్ఞాపించాడు. శవానికి తోడుగా ఎవరు వెళతారు....? కానీ, ఒక బ్రాహ్మణ స్త్రీ తన సవతి కూతుర్ని డబ్బుకి ఆశపడి, ఆ రాజభటులకి అమ్మేసింది. రాజకుమారుడి శవానికి ఆమెను కూడా కలిపి కట్టారు. స్మశానానికి తీసుకెళ్లారు. ఆ యువతి శోకం ఆకాశం విన్నదేమో మరి, కారు మబ్బులు కమ్మి , ఏ క్షణంలోనైనా కుంభవృష్టి కురిసే సూచనలు వాతావరణంలో కనిపించడం మొదలైయింది.

ఒకవైపు చితి పేరుస్తుండగానే సన్నగా మొదలైన వాన పెద్దదై పోయింది. దహన సంస్కారానికి వీలుకాని పరిస్థితి ఏర్పడింది. ఇక రాజభటులు చేయగలిగిందేమీ లేక శవాన్ని, శవంతో పాటు, ఆ యువతిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఆ గాఢాంధకారంలో ఆమెకి ఆ స్మశానంలో కాళీమాత దేవాలయం ఆశా దీపంలా కనిపించింది. మెల్లగా ఆ దేవాలయానికి చేరుకుంది ఆ అమ్మాయి. అమ్మకి ప్రదక్షిణాలు చేసి, తన కష్టాన్ని చెప్పుకొని, రక్షించమని వేడుకుంది. దయ గల తల్లి కదా కాళిక వెంటనే ప్రత్యక్షమయ్యి ఆమెకి కొన్ని మంత్రాక్షితలు ప్రసాదించింది. వీటిని ఆ యువరాజు శవం మీద జల్లు ఆతను బ్రతుకుతాడు. నీకు మరణం తప్పుతుంది. నీ సమస్య తీరిపోతుందిఅని అభయమిచ్చింది. క్షేమంగా ఇంటికి చేరాక, మారేడుదళాల నోము నోచుకోమని వ్రతవిధానాన్ని ఉపదేశించింది.

ఆ యువతి సంతోషంతో ఆ అక్షింతలని యువరాజు విగత శరీరంపైన జల్లింది. దాంతో అతను నిద్రనుండి మేల్కొన్నట్టుగా లేచి కూర్చున్నాడు. జరిగినదంతా తెలుసుకుని, కాళీమాతకి నమస్కరించాడు. ఆ యువతిని వివాహం చేసుకున్నాడు.

కాళీమాత చెప్పినట్టు ఆ తర్వాత ఆ యువతి చక్కగా మారేడు దళాల నోము శ్రద్ధాభక్తులతో నోచుకోని, సంతోష సౌభాగ్యాలతో వర్ధిల్లింది. ఆ నోము విధానం ఇక్కడ మీకోసం.

విధానం :- ప్రతిరోజూ మూడు మారేడుదళాలు, దోసెడు బియ్యం తీసుకొని శివుణ్ణి పూజించాలి. ఇలా ఒక సంవత్సరం పాటు చేశాక ఉద్యాపన చెయ్యాలి.

ఉద్యాపన :- ఒక బంగారు మారేడుదళాన్ని, ఒక వెండి మారేడుదళాన్ని చేయించాలి. ఈ రెండింటితోపాటు ఒక సాధారణ మారేడుదళాన్ని కూడా తీసుకొని మూడు దోసిళ్ళ బియ్యంతో శివుణ్ణి ఆరాధించాలి. ఆ తర్వాత పేదలకి అన్నదానం చేయాలి.

|| ఓం శ్రీమాత్రేనమః ||

For Updates Follow & Join

ఫేస్ బుక్ గ్రూప్ Vasthu House Remedies

ఫేస్ బుక్ పేజీ Vasthu House

ఫేస్ బుక్ పేజీ Karnati Vanitha

Vasthu House Blog

Vasthu House Remedies E-Book

వాస్తు హౌస్ రెమిడీస్ E-పుస్తకం

Whatsapp +91 7013477841

ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారము టాయిలెట్లు సరైన జోన్ లో వున్నాయా లేవా?

Main Entrance Doors & Toilets Located in Right Zone or Not?

Google Route MAP


Comments

Popular posts from this blog

రుద్రాభిషేకం ఎన్నిసార్లు చేయాలి?

Vasthu Tip (వాస్తు టిప్) 005

శ్రీ కేదారేశ్వర వ్రత కథ