శ్రీ కార్తీక పురాణము 5వ అధ్యాయము

శ్రీ కార్తీక పురాణము 5 అధ్యాయము


|| #వనభోజనమహిమ ||

#కార్తీకమాసం
 లో స్నానదాన పూజానంతరము శివాలయంలో కాని, విష్ణ్యాలయ మందుగాని శ్రీమద్భగవద్గీత పారాయణము తప్పక చేయవలెను. అట్లు చేసిన వారి సర్వ పాపములూ నివృతియగును. ఈ కార్తీక మాసంలో కరవీరపుష్పములు శివకేశవులకు సమర్పించినవారు వైకుంఠమునకు వెళ్తారు. భగవద్గీత కొంతవరకు పఠించినను వారికి విష్ణులోకము ప్రాప్తించును. కనీసం అందులోని శ్లోకములో ఒక్క పాదమైనా కంఠస్తం చేసినా విష్ణుసాన్నిధ్యము పొందుతారు.

కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండివున్న ఉసిరి చెట్టుక్రింద సాలగ్రామమును యధోచితముగా పూజించి, విష్ణుమూర్తిని ధ్యానించి, ఉసిరిచెట్టు నీడన భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రిందనే భోజనము పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించాలి. వీలునుబట్టి ఉసిరి చెట్టుక్రింద పురాణ కాలక్షేపం చేయవలెను. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచజన్మము పోయి నిజరూపము కలిగెను. ఆ ఇతిహాసము చూడండి.

|| కిరాత మూషికములు మోక్షము పొందుట ||

కావేరి తీరమందు ఒక చిన్నగ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండెవాడు. అతనికి శివశర్మ అనే పుత్రుడు కలడు. ఆ పుత్రుడు చిన్నతనము నుండి భయభక్తులు లేక అతిగారాబంగా పెరుగుటవలన నీచ సహవాసము చేసి దురాచారపరుడై వుండెవాడు. అది చూసిన తండ్రి ఒకనాడు కుమారున్ని పిలిచి " బిడ్డ! నీ దురాచారములకు అంతులేకుండా వున్నది. నీ గురించి ప్రజలు పలువిధాలుగా చెప్పుకొంటున్నారు. నన్ను నిలదీసి అడుగుతున్నారు. నీవల్ల కలిగెనిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేక పోతున్నాను. కాబట్టి నీవు కార్తీకమాసంలో నదిలో స్నానంచేసి శివకేశవులను స్మరించి, సాయంకాలంలో దీపారాధన చేసిన యెడల నీవు చేసిన పాపములు పొవడమే కాకుండా నీవు మోక్షప్రాప్తి కూడా పొందుతావు. కావున నువ్వు అలా చేయమని బోధించాడు. దానికి కుమారుడు " తండ్రి! స్నానము చేసిన వంటి మురికి పోవుటకు మాత్రమే కాని వేరు కాదు! స్నానమాచరించి పూజలు చేసినంతమాత్రన భగవంతుడు కనిపించునా! దేవలయంలో దీపములు వెలిగించిన లాభమేమిటి? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిదికాదా! " అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చెను. కుమారుని సమాధానము విని తండ్రి " ఓరీ నీచుడా! ! కార్తీకమాస ఫలమును అంత చులకనగా చూస్తున్నావు కావున నీవు అడవిలో రావిచెట్టు తొర్రలో ఏలుక రూపంలో బ్రతికెదవు గాక" అని శపించెను. ఆ శాపంతో కుమారుడికి జ్ణానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి " తండ్రీ! క్షమింపుము అజ్ణానాంధకారంలో పడి దైవమునూ, దైవకార్యములను ఎంతో చులకనగా చేసి వాటి ప్రభావం గ్రహించలేకపోయను. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకు శాపవిమోచనం ఎప్పుడు, ఏవిధంగా కలుగునో వివరించండి " అని ప్రాదేయపడగా " నీవెప్పుడు కార్తీకమహాత్మ్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహాస్థితి కలిగి ముక్తినొందుతవు" అని కుమారున్ని వూరడించాడు. వేంటనే శివశర్మ ఎలుక రూపముపొంది అడవికిపొయి ఒక చెట్టుతొర్రలో ఫలములు తింటు వుండెను.

ఆ అడవి కావేరి నది తీరమునకు సమీపాన ఉండటంచేత స్నానర్థమై నదికి వెళ్ళెవారు అక్కడున ఆ పెద్దవటవృక్షము నీడలో కొంతసేపు విశ్రమించి, లోకాభిరామయణము చర్చించుకుంటు నదికి వెల్తుండెవారు.

అలా కార్తీక మాసంలో ఒక రోజు మహర్షులగు విశ్వామిత్రులవారు శిష్యసమేతంగా కావేరినదికి స్నానర్థమై బయలుదెరారు. అలా బయలుదెరి ప్రయాణపు బడలికచేత మూషికమువున్న ఆ వటవృక్షము క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీకపురాణము వినిపింస్తూవుండగా. ఇంతలో చెట్టుతొర్రలో నివసిస్తున్న మూషికము వీరిదగ్గరున్న పూజాద్రవ్యంలో ఏదైన తినేవస్తువు దొరుకుతుందెమోనని బయటకు వచ్చి చెట్టుమొదట నక్కివుండెను.

అంతలో ఒక కిరాతకుడు వీరిజాడ తెలుసుకొని, ' వీరు బాటసారులై వుంటారు వీరివద్దనున్న ధనం అపహరించవచ్చు' అనుకొని వచ్వి చూడగా వారందరు మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపొయింది. వారికి నమస్కరించి " మహానుబావులారా! తమరెవరు? ఎక్కడి నుండి వచ్చారు? మీ దివ్య దర్శనమూతో నా మనస్సు చెప్పరాని ఆనందము కలుగుతున్నది. కావున వివరించండి" అని ప్రాదేయపడాడు.

అప్పుడు విశ్వమిత్రులవారు " ఓయీ! కిరాతకా! మేము కావేరి నదీస్నానర్థమై ఈ ప్రాంతనికి వచ్చాము. స్నానమాచరించి కార్తీక పురాణము పఠించుచున్నాము. నీవు కూడా ఇక్కడ కూర్చొని సావధానుడవై ఆలకింపుము" అని చెప్పిరి. అలా కిరాతకుడు కార్తీకమహాత్మ్యమును శ్రద్దగా ఆలకిస్తుండగా తన వెనుకటి జన్మవృత్తాంతమంతా జ్ణాపకానికి వచ్చి, పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకుపోయెను.

అటులనే అహారమునకై చెట్టుమొదట దాగివుండి పురాణమంతా వింటున్న ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము పొంది " మునివర్యా! ధన్యోస్మి, తమ దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపమునుండి విముక్తుడనైతిని" అని తన వృత్తాంతమంతా చెప్పి వెల్లిపోయెను.

కనుక ఇహములో సిరిసంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణము చదివి ఇతరులకు వినించాలి.

ఐదవరోజు పారాయణము సమాప్తము.

ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే 5వ అధ్యాయము స్సమాప్తః

సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !

- స్వస్తి-.


|| ఓం శ్రీమాత్రేనమః ||

For Updates Click Below & Join

ఫేస్ బుక్ గ్రూప్ Vasthu House Remedies

ఫేస్ బుక్ పేజీ Vasthu House

ఫేస్ బుక్ పేజీ Karnati Vanitha

Vasthu House Blog

Karnati Vanitha Blog

Vasthu House Remedies E-Book

వాస్తు హౌస్ రెమిడీస్ E-పుస్తకం

Whatsapp +91 7013477841

ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారము టాయిలెట్లు సరైన జోన్ లో వున్నాయా లేవా?

Main Entrance Doors & Toilets Located in Right Zone or Not?

Google Route MAP


Comments

Popular posts from this blog

రుద్రాభిషేకం ఎన్నిసార్లు చేయాలి?

Vasthu Tip (వాస్తు టిప్) 005

శ్రీ కేదారేశ్వర వ్రత కథ