దేవీ నవరాత్రుల ప్రసాదములు తయారు చేసే విధానం_వాస్తు హౌస్
దేవీ
నవరాత్రులు సమీపించుచున్న శుభతరుణంలో అమ్మవారి ప్రసాదములు తయారు చేసే విధానం
1. !! శ్రీ బాలత్రిపురసుందరిదేవి !!
మొదటి రోజు : -!! పొంగల్ !! కావలసినవి !!
పెసరపప్పు
150 గ్రాం
కొత్త
బియ్యం 100 గ
మిరియాలు
15
పచ్చిమిరప
కాయలు 6
పచ్చి
కొబ్బెర 1 కప్
కాచిన
నెయ్యి ¼ కప్
జీడిపప్పు
15
జీర
½ టేబల్ స్పూన్
ఆవాలు
¼ టేబల్ స్పూన్
ఎండుమిర్చి
3
మినపప్పు, శనగపప్పు
2 టేబల్ స్పూన్స్
కోత్తమిర, కరేపాకు
తగినంత
ఉప్పు
రుచిని బట్టి
ఇంగువ
2 చిటికెళ్ళు.
!! చేయవలసిన విధానము !!
దళసరి
పాత్రలొ లో కాస్త నేయి వేడి చేసి పెసరపప్పుని దోరగా ఏయించండి. బియ్యం కడిగి
నీళ్ళన్నీ తీసేసిన తరువాత బియ్యం కూడా బాగా వేయించండితెలుపు రంగు పోకూడదు సుమా 5
నిమిషాలు వేపితే చాలు పెసరపప్పుకూడ కలర్ మార కూడదు.
అదే మూకుడులో మరికాస్త నెయ్యి వేసి జీడిపప్పులను వేయించి పెట్టడి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, పచ్చి కొబ్బెర కోరి, జీలకర్ర మిరియాలు వేయించిన బియ్యం పెసరపప్పు ఇవన్నీ 4 కప్పుల నీళ్ళతో కుక్కర్లో వుంచి 3 whistles (కూతలు) వచ్చాక ష్టవ్ కట్టి వేయడం చేయండి.
చల్లారాక అందులో ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జిలకర్ర, ఎండుమిర్చి,ఇంగువ, కరివేపాకు వేసి తాలింపు పెట్టిమిగిలిన నేయ్యి అంతా పొంగలిలో వేసి వేడి వేడి ప్రసాదము ఆతల్లి త్రిపురసుందరీదేవికి నైవేద్యంపెట్టి భక్తిగా పూజించి ఈ దసరా 10 రోజులు మాకు శక్తినిచ్చి నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు తల్లీ అని ప్రార్ధించాలి.
2. !! గాయత్రి దేవి !!
రెండవ రోజు :- !! పులిహోర !! కావలసినవి !!
బియ్యం
150 గాం
చింతపండు
50 గ్రాం
పసుపు
½ స్పూన్
ఎండుమిర్చి
5
ఆవాలు
½ స్పూన్
మినపప్పు
1 స్పూన్
శనగ
పప్పు 2 స్పూన్
వేరు
శనగ పప్పు ½ కప్పు
కరివేపాకు
2 రెబ్బలు
ఇంగువ
చిటికెడు
నూనె
¼ కప్పు
ఉప్పు
తగినంత
బెల్లం
కొద్దిగా
!! చేయవలసిన విధానము !!
అన్నం వండి చల్లార్చి పసుపు, ఉప్పు, కలిపి పెట్టాలి. చింతపండును అరకప్పు నీళ్ళు పోసి నాన పెట్టి, చిక్కటి గుజ్జు తీసి పెట్టండి. మూకుడులో కాస్త నూనె వేసి అందులో ఆవాలు ఎండుమిర్చి వేసి ఈ చింతపండు గుజ్జు వేసి కాస్తబెల్లం వేసి బాగా వుడికించండి (కావాలంటే పచ్చి మిర్చి వేసుకోవచ్చుగుజ్జులో ) ఉడికిన గుజ్జు అన్నంలో కలిపండి. బాండిలో (మూకుడులో) నూనె వేడి చేసి ముందుగా ఆవాలు, మినపప్పు, శనగ పప్పు, ఇంగువ, ఎండుమిర్చి, వేసి ఆ వాలు చిటపట అన్న తరువాత వేరుశనగ గుళ్ళు వేసి అన్నీ బాగా వేగాక కరివేపాకు వేసి, అన్నంలో కలపడమే కమ్మటి పులిహోర రెడి అవ్వగానే శ్రీజగదీశ్వరీ మాత అయిన ఆ గాయిత్రి దేవికి నైవేద్యం పెట్టి ఆ తల్లి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుందాము.
బియ్యం
½ కిలో
తురిమిన
పచ్చికొబ్బెర 1 కప్
పచ్చిమిర్చి
5
కరివేపాకు, కోత్తమిర,
ఉప్పు
పోపు
సామాగ్రి ఎండుమిర్చి,
ఇంగువ
జీడి
పప్పు 10
నూనె
¼ కప్
నెయ్యి
1 టెబల్ స్పూన్.
అన్నం
పోడి పోడి గా వండుకొని పచ్చికొబ్బెర కాస్త నేతిలో వేయించి ఈ వేగిన కొబ్బెర అన్నంలో
కలిపండి. అదే మూకుడులో నూనె వేసి పోపు సామాగ్రీ వేసి ఎండుమిర్చి, ఇంగువ,
వేసి ఆవాలు చిటపట చిటపట అనగానే పొడవుగా తరిగిన పచ్చిమిరప కాయలు, కరివేపాకు, కోత్తమిర, అందులో వేసి తీసేయండి ఈ వేగనిచ్చినదంతా
అన్నంలో కలిపి ఉప్పు, జీడిపప్పు కూడ వేసి పైన కాస్త కోత్తిమీర చల్లండి కమ్మటి
కొబ్బెరన్నం తయారు.
శ్రీ
అన్నపూర్ణా దేవికి నైవేద్యం పెట్టి మనస్సు పూర్తిగా ప్రార్థించి అమ్మ కృపకు
పాత్రులవుదాము.
4. !! లలితా దేవి !!
నాల్గవ రోజు :- !! మినప గారెలు !! కావలసినవి !!
అల్లం
చిన్నముక్క
పచ్చిమిరప
కాయలు 6 సన్నగా తరిగినవి
జీరా
¼ స్పూన్
ఉప్పు
రుచికి తగినంత
కరివేపాకు, కోత్తమిర
తగినంత
నూనె
గారెలు వేయించేందుకు
మినపప్పు
బాగా కడిగి 4,
5 గంటలు (hours) నానపెట్టి లేకుంటే ముందు రోజు రాత్రి నాన పెట్టుకొండి). నానిన మినపప్పును గ్రైండర్లో వేసి, ఉప్పు, కాస్త సోడ, వేసి బాగా
గ్రైండ్ చేసుకోండి. ఆ పిండిలో అల్లం, పచ్చిమిరప కాయలు
కరివేపాకు, కోత్తమిర, సన్నగా తరిగి
వేసి కాగిన నూనెలో ఈ మినపిండిని చేతిలో తీసుకొని రౌండుగా అదిమి నూనెలో వేసి దోరగా
వేగిన వడలను సహస్రనామాలతో ఆ శ్రీ లలితాదేవికి ఆరాధించి నైవేద్యం పెట్టి ఆశీర్వాదం
పొందుదాము.
5. !! సరస్వతి దేవి !!
పాలు
½ లీ
చిక్కటి
పెరుగు ½ లీ
నూనె
½ కప్పు
నెయ్యి
1 స్పూన్
కొత్తమిర, కరివేపాకు
చిన్న
అల్లం ముక్క
పచ్చిమిర్చి
పోపు
సామాగ్రి
జీడిపప్పు
20
ఉప్పు, ఇంగువ
ఎండుమిర్చి.
ముందు
బియ్యం కడిగి అన్నం వండి,
కాస్త చల్లారాక కాచినపాలు, పెరుగు, ఉప్పు వేసి బాగా కలిపి వుంచండి. సన్నగా తరిగిన
చిల్లి, కొత్తమిర, కోరిన అల్లం, అన్నీ రెడిగా వుంచుకొని ష్టవ్ పై మూకుడుంచి అందులో నునె వేసి
పోపు కావలసినవన్నీ వేసి ఎండుమిర్చి ఇంగువతో పాటు తరిగి వుంచిన వన్నీ వేసి బాగా
వేగనిచ్చి పెరుగులో కలిపి కాస్త నేతిలో జీడిపప్పులు వేయించి అవీవేయండి రుచికరమైన
దద్ధోజనం అంటే ఆ చదువుల తల్లికి అంత మక్కువ ఆ తల్లి దీవెనలతో అందరూ బాగా చదివి
అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని కోరుతూ ప్రార్థించాలి.
6. !! శ్రీ మహాలక్ష్మిదేవి !!
ఆరవ రోజు :- !! రవ్వ కేసరి !! కావలసినవి !!
షుఘర్
¾ కప్
నెయ్యి
2 టెబల్ స్పూన్
కేసరి
కలర్/చిటికెడు
యాలకులు
4
ఎండుద్రాక్ష
6
జీడిపప్పు
10
మిల్క్
1 కప్ ( మిల్క్ మేడ్ 1 )
వాటర్
½ కప్.
!! చేయవలసిన విధానము !!
ముందు
మూకుడులో కాస్త నెయ్యి వేసి రవ్వ దోరగా
వేయించి తీసి ప్లేట్ లో వేసి వుంచండి. మూకుడులో కాస్త నెయ్యి వేసి
జీడిపప్పు, ఎండుద్రాక్ష వేయించి తీసి వుంచండి. నీళ్ళు, పాలు కలిపి
బాగా మరగనివ్వాలి. అందులో
కేసరి
కలర్, చెక్కర, రవ్వ వేసి నెయ్యి వేస్తూ బాగా కలిపి అందులో
ద్రాక్ష, జీడిపప్పు, మిగిలిన నెయ్యి
అంతా వేసి బాగా కలిపి వేడి వేడిగా ఘుమ ఘుమగా నేతితో ఆ మహాలక్ష్మికి నైవేద్యముగా
పెట్టి సౌభాగ్యం ఇవ్వమని ప్రార్ధించి నైవేద్యం పెట్టండి.
7. !! శ్రీ దుర్గా దేవి !!
బియ్యం
½ కప్ (కొత్తబియ్యం అయితే మరీ రుచిగా వుంటుంది)
1
వంకాయ
¼ సొరకాయ
1
దోసకాయ
బీన్స్
తగినన్ని
1
ఆలుగడ్డ
వేరుశెనక్కాయలు
( పీనట్ ) 2 పిడికిళ్ళు
2
మొక్కజొన్నలు
½ క్యారెట్
2
టోమాటో
తగినంత
కరివేపాకు, కోత్తమీర
కోరిన
పచ్చి కొబ్బెర 1 చిప్ప
4
పచ్చి మిర్చి
నూనె
తగినంత
నెయ్యి
చిన్న కప్పు
చింతపండు
గుజ్జు తగినంత
కాస్త
బెల్లం ( జాగిరి )
ఉప్పు, పసుపు
తగినంత
3
చెంచాలు సాంబర్ పౌడర్
పోపు
గింజలు, ఎండుమిర్చి, ఇంగువ.
ముందుగ
కాయగూరలన్ని మీకు కావలసిన సైజులో తరుక్కోని వుంచుకోండి.
కుక్కర్లో
కందిపప్పు, బియ్యం, పల్లీలు, టోమాటో తప్ప
అన్నీ కూరగాయలు వేసి
పసుపు, ఉప్పు, నీళ్ళు 5 పావులు వేసి రెండు విజిల్స్ వచ్చాక stove off చేయండి.
మూకుడులో
కొద్దిగ నూనె వేసి వేడి చేసాక అందులో కొద్దిగ ఆవాలు వేసి అవి చిట్లిన తరువాత పచ్చిమిర్చి, కరేపాకు, టొమాటో, చింతపండు గుజ్జు, సాంబర్
పౌడర్, జాగిరి (బెల్లం) వేసి బాగా ఉడికిన తరువత ఆ గ్రేవి
అంతా ఉడికిన అన్నములో వేసి, కోత్తమీర, కరివేపాకు, నెయ్యి వేసి మరోసారి ఉడికించండి. అంతా బాగాఉడికిన తరువాత ఎండుమిర్చి, ఇంగువతో తాలింపు పెట్టి కొబ్బరి కలిపి దించండి వేడి వేడిగా దుర్గాదేవికి
నెయ్యి వేసి నైవేద్యం పెట్టి ఆ తల్లి దీవెనలు పొందండి.
8. !! మహిషాసుర మర్ధిని !!
బెల్లం
150 గ్రాం
యాలకులు
5
నెయ్యి
50 గ్రాం
జీడిపప్పు
10.
ముందుగా
బియ్యం కడిగి అరగంట నాననివ్వండి. తరువాత మెత్తగా ఉడికించాలి.
అందులో
తరిగిన బెల్లం వేసి మొత్తం కరిగెంత వరకు ఉడికించాలి. జీడిపప్పులు నేతిలో దోరగా
వేయించి, యాలకుల పొడి మిగితా నెయ్యి మొత్తం అన్నంలో కలిపి దించి వేయండి. తియ్యని
కమ్మని నైవేద్యం సమర్పించుకొని అమ్మ కృపకు పాత్రులమవుదాము.
9. !! రాజ రాజేశ్వరి దేవి !!
బియ్యం
1 కప్
చెక్కర
1 ½ కప్స్
ద్రాక్షా
, జీడిపప్పు ¼ కప్
యాలకుల
పౌడర్ ½ స్పూన్
నెయ్యి 5 టేబల్ స్పూన్స్.
ముందు దట్టమైన వెడల్పాటి పెద్ద గిన్నెలో
కాస్త నెయ్యి వేసిఅందులో బియ్యం పోసి
పచ్చి వాసన పోయెంత వరకు వేయించండి తరువాత పాలు, యాలకుల పౌడర్, వేసి కుక్కర్ లో రెండు విజిల్స్ వచ్చెంత
వరకు ఉంచండి. అది పక్కన పెట్టి చిన్న మూకుడు ష్టవ్ పై వుంచి అందులో కాస్త నెయ్యి వేసి ఈ ఎండు ద్రాక్ష, జీడిపప్పు దోరగా
వేయించి ఉంచండి. చల్లారిన కుక్కర్ మూత ఓపన్ చేసి ఉడికిన అన్నానికి చెక్కరవేసి ఒక్క
5 నిముషాలు మళ్ళీ ఉడికించి ( అలా ఉడికినప్పుడు బియ్యం పాలు చెక్కర కలుపుకొని
చిక్కగా కావాలి ) అందులో వేయించిన జీడిపప్పు అవి వేసి బాగా కలిపి కాస్త నెయ్యి
వేసి వేడి వేడిగా ఆ రాజ రాజేశ్వరిదేవికి నైవేద్యం పెట్టండి.
10. ప్రధాన దేవతను సర్వ ఆభరణములతో అలంకరణ చేసి పదవ రోజు ఈ తొమ్మిది రోజులూ చేసిన అన్ని ప్రసాదములను నైవేద్యముగా పెట్టాలి.
ఓం శ్రీ మాత్రే నమః !!
(మీ కర్నాటి వనిత)
వాస్తు హౌస్
For Updates Follow & Join
ఫేస్ బుక్ గ్రూప్ Vasthu House Remedies
ఫేస్ బుక్ పేజీ Vasthu House
ఫేస్ బుక్ పేజీ Karnati Vanitha
వాస్తు హౌస్ రెమిడీస్
E-పుస్తకం
ఇంటి ప్రధాన ప్రవేశ
ద్వారము & టాయిలెట్లు సరైన జోన్ లో వున్నాయా లేవా?
Comments
Post a Comment