దేవుడు కలలో కనపడితే ఫలితం ఏమిటి?
దేవుడు కలలో కనపడితే ఫలితం ఏమిటి?
మనం తరచూ కలలు
కంటుంటాం. చాలామందికి నిత్యం తమ జీవితాల్లో జరిగే విషయాలు, అంశాలు కలల్లో కనిపిస్తుంటాయి. అయితే మీకు
ఎప్పుడైనా కలలో దేవుడు కనిపించాడా.? ఒకవేళ మీ కలలో దేవుడు
కనిపిస్తే ఏం జరుగుతుంది.? దేవుడు కలలో కనిపిస్తే.. దేనికి
సంకేతం.? స్వప్న శాస్త్రం ప్రకారం.. ప్రతీ కలకు ఓ అర్ధం
ఉంటుంది. అలాంటి పరిస్థితిలో, మీరు కలలో దేవుడిని చూస్తే..
దానికి ప్రత్యేకమైన సంకేతం ఉంటుంది. కలలో ఏ దేవుడు కనిపిస్తే.. ఏం జరుగుతుందో
ఇప్పుడు చూద్దాం..
దుర్గామాత కోపంగా
కనిపిస్తే..
మీ కలలో
దుర్గామాతను కోపంగా చూసినట్లయితే, ఆ కల అశుభ పరిణామానికి సంకేతం. అంటే ఆ తల్లి మీపై కోపంగా ఉందని అర్థం.
ఒకవేళ దుర్గామాత సింహంపై స్వారీ చేసినట్లు మీకు కలలో కనిపిస్తే.. మీ జీవితంలో
సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని అర్ధం.
శివుడిని కలలో
చూస్తే..
మీ కలలో
శివుడిని చూసినట్లయితే, మీరు
సమస్యల నుంచి అతి త్వరలో విముక్తి పొందనున్నట్లు అని అర్ధం. శివుడు కలలోకి
వచ్చాడంటే.. అన్ని ఇబ్బందులు తొలిగినట్లే. అంతేకాకుండా మీ కలలో శివలింగాన్ని
చూసినట్లయితే, ఆ కల కూడా ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు.
మీ జీవితంలో పురోగతి, కీర్తిని పొందుతారని.. దాని సంకేతం.
రాముడిని కలలో
చూస్తే..
మీరు కలలో
రాముడిని చూస్తే.. చాలా శుభప్రదం. మీ జీవితంలో పురోగతికి అవకాశాలు లభిస్తాయని
అర్థం. అయితే అందుకు మీ విధులను మీరు సక్రమంగా నిర్వర్తించాలని ఆ కల సంకేతం.
కలలో శ్రీకృష్ణుని
దర్శనం..
మీకు కలలో శ్రీకృష్ణుడు
కనిపిస్తే.. స్నేహం, లేదా
మరేదైనా బంధం ద్వారా మీ జీవితంలో ప్రేమ చిగురిస్తుందని దాని అర్ధం. ఒకవేళ మీరు
ఎవరితోనైనా ప్రేమలో ఉంటే.. ఈ కల చాలా పవిత్రమైనది అని అంటారు.
కలలో విష్ణువు
దర్శనం..
మీ కలలో
విష్ణువును చూసినట్లయితే, మీరు
విజయం సాధిస్తారని.. జీవితంలో పురోగతిని పొందుతారని అంటారు.
లక్ష్మీదేవి కలలో
కనిపిస్తే..
మీ కలలో లక్ష్మీదేవి కమలంపై కూర్చున్నట్లు కనిపిస్తే, అది చాలా పవిత్రమైన కలగా పరిగణిస్తారు. ఈ కల సంపదకు చిహ్నం. కలలో లక్ష్మీమాతను చూస్తే.. మీకు డబ్బు త్వరలోనే లభిస్తుందని.. లాభాలను పొందుతారని అంటారు.
For Updates Follow & Join
ఫేస్ బుక్ గ్రూప్ Vasthu House Remedies
ఫేస్ బుక్ పేజీ Vasthu House
ఫేస్ బుక్ పేజీ Karnati Vanitha
వాస్తు హౌస్ రెమిడీస్
E-పుస్తకం
ఇంటి ప్రధాన ప్రవేశ
ద్వారము & టాయిలెట్లు సరైన జోన్ లో వున్నాయా లేవా?

Comments
Post a Comment