భోజనం చేసేటప్పుడు ఏ దిక్కున తిరిగి భుజించాలి? ఎందుకు?

 భోజనం చేసేటప్పుడు ఏ దిక్కున తిరిగి భుజించాలి?


మనిషి శక్తికి ముఖ్యమైనది ఆహారం. ఆ ఆహారంలో ఎన్నో రకాలున్నాయి. వివిధ రకాలుగా వివిధ రుచులతో ఇష్టమైన రీతిలో ఆహారాన్ని తయారు చేసుకొని కడుపారా ఆరగిస్తూంటాం. ఆ వంటకాలు ఎంతో శుభ్రంగానూ, రుచిగా, ఆరోగ్యకరంగా కూడా ఉండాలని భావిస్తాం.

అయితే ఈ ఆహారాన్ని ఏ వైపు కూర్చొని తినాలన్నా ఈ విషయాన్ని ఆలోచించామా? పూర్వకాలంలో అయితే పీటలు వేసుకుని కూర్చొని భుజించేవాళ్ళు.  కానీ ఈ ఆధునిక కాలంలో డైనింగ్ టేబుల్ అంటూ ఏ దిశలో కూర్చుంటున్నామో కూడా తెలియడం లేదు. టేబుల్ ని కూడా సరైన దిశలో అమర్చుకుని తింటే మనకు శుభాలు కలుగుతాయి.

తూర్పు వైపు ముఖం పెట్టి భుజించడం ద్వారా ఆయుష్షు పెరుగుతుంది. 

పడమర వైపు కూర్చుని భుజిస్తే ఇంట్లోని సామాను వృద్ధి చెందుతుందట.

ఉత్తరం దిక్కు చూస్తూ కూర్చుని భుజించరాదు. ఆ వైపు ముఖం పెట్టి భుజిస్తే సర్వ అరిష్టాలతో పాటు అనారోగ్యాలు వెన్నంటే ఉంటాయట. పితృకార్యాలలో మాత్రమే ఉత్తర ముఖంగా కూర్చొని భుజించాలి.

దక్షిణం వైపు ముఖం పెట్టి కూర్చొని ఎప్పుడు భుజించరాదు. 

టేబుల్ పైన అయిన సరే, పీట వేసుకుని భుజించే సమయంలోనైనా సరే తూర్పు, పడమర దిశలలో కూర్చోవడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి.

For Updates Follow & Join

ఫేస్ బుక్ గ్రూప్ Vasthu House Remedies

ఫేస్ బుక్ పేజీ Vasthu House

ఫేస్ బుక్ పేజీ Karnati Vanitha

Vasthu House Blog

Vasthu House Remedies E-Book

వాస్తు హౌస్ రెమిడీస్ E-పుస్తకం

Whatsapp +91 7013477841

ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారము & టాయిలెట్లు సరైన జోన్ లో వున్నాయా లేవా?

Main Entrance Doors & Toilets Located in Right Zone or Not?

Google Route MAP

Comments

Popular posts from this blog

రుద్రాభిషేకం ఎన్నిసార్లు చేయాలి?

Vasthu Tip (వాస్తు టిప్) 005

శ్రీ కేదారేశ్వర వ్రత కథ