దేవీ నవరాత్రుల ప్రసాదములు తయారు చేసే విధానం_వాస్తు హౌస్

దేవీ నవరాత్రులు సమీపించుచున్న శుభతరుణంలో అమ్మవారి ప్రసాదములు తయారు చేసే విధానం 1. !! శ్రీ బాలత్రిపురసుందరిదేవి !! మొదటి రోజు : - !! పొంగల్ !! కావలసినవి !! పెసరపప్పు 150 గ్రాం కొత్త బియ్యం 100 గ మిరియాలు 15 పచ్చిమిరప కాయలు 6 పచ్చి కొబ్బెర 1 కప్ కాచిన నెయ్యి ¼ కప్ జీడిపప్పు 15 జీర ½ టేబల్ స్పూన్ ఆవాలు ¼ టేబల్ స్పూన్ ఎండుమిర్చి 3 మినపప్పు , శనగపప్పు 2 టేబల్ స్పూన్స్ కోత్తమిర , కరేపాకు తగినంత ఉప్పు రుచిని బట్టి ఇంగువ 2 చిటికెళ్ళు. !! చేయవలసిన విధానము !! దళసరి పాత్రలొ లో కాస్త నేయి వేడి చేసి పెసరపప్పుని దోరగా ఏయించండి. బియ్యం కడిగి నీళ్ళన్నీ తీసేసిన తరువాత బియ్యం కూడా బాగా వేయించండితెలుపు రంగు పోకూడదు సుమా 5 నిమిషాలు వేపితే చాలు పెసరపప్పుకూడ కలర్ మార కూడదు . అదే మూకుడులో మరికాస్త నెయ్యి వేసి జీడిపప్పులను వేయించి పెట్టడి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, పచ్చి కొబ్బెర కోరి , జీలకర్ర మిరియాలు వేయించిన బియ్యం పెసరపప్పు ఇవన్నీ 4 కప్పుల నీళ్ళతో కుక్కర్లో వుంచి 3 whistles (కూతలు) వచ్చాక ష్టవ్ కట్టి వేయడం చేయండి. చల్లారాక అందులో ఆవాలు...