గురుపౌర్ణమి ఎలా వచ్చింది? విశిష్ఠత ఏమిటి?

గురుపౌర్ణమి... ఆషాఢ శుద్ధపౌర్ణమిని ‘ గురు పౌర్ణమి ’ లేదా ‘ వ్యాస పౌర్ణమి ’ అని అంటారు . ఇదే రోజు వ్యాస ముహాముని జన్మతిథి కావున మహాపర్వదినంగా అనాది కాలం నుంచీ భావిస్తున్నారు . ఈ రోజున గురుభగవానుడిని , వ్యాస మహర్షిని పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం . గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కష్టమైన సంస్కతి మనది . ” గు ” అంటే అంధకారం / చీకటి అని అర్థం . ” రు ” అంటే తొలగించడం అని అర్థం . అజ్ఞానాంధకారాన్ని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదు . కాగా హిందూమతంలో గురు పూర్ణిమను చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు . ఈ ఏడాది గురు పౌర్ణమి 13 జూలై 2022 బుధవారం జరుపుకుంటున్నారు . గురు పూర్ణిమ ఎలా జరుపుకోవాలి ? విశిష్టత ఏంటి ? గురు పూర్ణిమ ఎందుకు జరుపుకుంటాము ఒకసారి తెలుసుకుందాము ? ఆది యోగి , ఆది గురువైన మహా శివుడు ఆషాఢ పౌర్ణిమి నాడు సప్తర్షులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతున్నది . ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చ...