గర్భ రక్షాంభికా స్తోత్రం

గర్భ రక్షాంభికా స్తోత్రం గర్భరక్షాంబికా అంటే గర్భములో ఉన్న శిశువును , ఆ గర్భం దాల్చిన తల్లిని కాపాడే అమ్మలగన్న యమ్మ చాల పెద్దమ్మ. పార్వతీ మాతయే గర్భారక్షాంబికా అమ్మగా పిలవబడుతోంది. అమ్మ వారు కేవలం గర్భం దాల్చిన వారికే కాకుండా , సంతానము లేని దంపతులకు కూడా సత్సంతానము కటాక్షిస్తుంది. పూర్వం ఇక్కడ నిధ్రువ అనే ఒక మహర్షి ఆయన ధర్మపత్ని వేదికతో కలిసి ఒక ఆశ్రమం లో నివసించేవారు. వాళ్ళు ఎప్పుడూ ఈశ్వరుని పూజిస్తూ విహిత కర్మాచరణ చేస్తూ ఆ దంపతులు ఇద్దరు ఆనందంగా కాలం గడిపేవారు. అయితే వారికి ఉన్న ఒకే సమస్య సంతానము కలుగక పోవడం. సంతానము కొఱకై ఈ దంపతులు అమ్మ వారిని , తండ్రి శంకరుడిని విశేష ఆరాధన చేశారు. ఒక మంచి రోజు ఆ తల్లి గర్భం దాల్చింది. ఇలా గర్భం దాల్చిన తర్వాత , ఒక రోజు నిధ్రువ మహర్షి వరుణుడిని కలుసుకోవడానికి బయటకి వెళతారు. అప్పుడు వేదిక మూడవ త్రైమాసికం లో ఉన్నది , కొద్ది రోజులలో ప్రసవం జరగాల్సి ఉంది. నిధ్రువ మహర్షి బయటకి వెళ్ళిన సమయంలో ఊర్ధ్వపాదుడు అనే మహర్షి ఆశ్రమమునకు వచ్చారు. అప్పటికే ఇంటి పనులలో అలసిపోయిన వేదిక విశ్రాంతి తీసుకుంటోంది , దాంతో వచ్చిన మహర్షికి అతిథి మర్యాదలు ...